తేజ్ ఐ లవ్ యు మూవీ రివ్యూ

మెగాస్టార్ మేనల్లుడిగా తెరమీదికొచ్చిన సాయి ధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే తన ఎనర్జిటిక్ నటనతో, డాన్స్ లతో సుప్రీమ్ హీరోగా ఎదిగాడు. తన మామయ్యల్లాగే మాస్ హీరోగా మంచి పేరే సంపాదించుకున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి హిట్ సినిమాలతో తాను సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఐతే వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సాయి ధరమ్ ఈ సారి మాస్ ఇమేజ్ పక్కకు పెట్టి తొలిప్రేమ సినిమా దర్శకుడు అయిన కరుణాకరన్ దర్శకత్వంలో లవర్ బాయ్ గా మన ముందుకు వొచ్చిన చిత్రమే తేజ్ I Love U

కథ
చిన్నప్పుడే అమ్మ నాన్నలకి దూరమైన తేజ్ తన పెద్దనాన్న పెద్దమ్మ ల దగ్గర పెరుగుతాడు.ఒక మహిళ ని కాపాడే ప్రయత్నంలో హత్య చేసి జైల్ కి వెళ్తాడు.విడుదలైన తర్వాత ఒక సంఘటనతో కుటుంబం నుండి అతను వెళ్లిపోవాల్సి వొస్తుంది.తర్వాత హైదరాబాద్ కి వెళ్లి తన బాబాయ్ ఇంట్లో మ్యూజిక్ ట్రూప్లో పనిచేస్తుంటాడు. లండన్ నుండి వొచ్చిన నందిని (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. తన ప్రేమని ప్రపోజ్ చేసే టైంలో నందినికి ఆక్సిడెంట్ అయ్యి ఆమె గతాన్ని మర్చిపోతుంది. ఆమెకి గతం గుర్తు వొచ్చిందా? వాళ్ళిద్దరి ప్రేమ ఫలించిందా అనేది తర్వాతి కథ

రివ్యూ
ప్రేమకథల్లో ఉండే ఫీల్ ని చాలా సహజంగా హృద్యంగా దృశ్యీకరించటంలో కరుణాకరన్ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. తొలిప్రేమ, డార్లింగ్ లాంటి సినిమాల్ని తను మలిచిన విధానాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఐతే అలాంటి హిట్ కోసం కరుణాకరన్ కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. మాస్ హీరోని లవర్ బాయ్ గా మార్చి కుటుంబ అనుబంధాలతో దర్శకుడు ఈ సినిమా ని రూపొందించాడు. అయితే ఇందులో కరుణాకరన్ మార్క్ మిస్ అయ్యింది అనే సంగతి మొదటి సగంలోనే తెలిసిపోతుంది. కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగతా అంతా రొటీన్ గా సాగిపోతుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోవటం, గత సినిమాలు గుర్తుకు రావడం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అంశంగానే కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ,నిర్మాణ విలువలు బాగున్నాయి,సంగీతం కూడా అంతగా మెప్పించలేకపోయింది

ప్లస్ పాయింట్స్
అనుపమా పరమేశ్వరన్ నటన
కామెడీ సీన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
రొటీన్ కథనం
ఫస్ట్ హాఫ్
సంగీతం

పంచ్ లైన్
హీరోయిన్ గతాన్ని మర్చిపోయినట్టుగా
డైరెక్టర్ తన గత సినిమాల్ని మర్చిపోలేకపోవటం

నటీనటులు
కాస్టింగ్ : సాయి ధరమ్ తేజ్,అనుపమా పరమేశ్వరన్
జయ ప్రకాష్,పవిత్ర లోకేష్,పృథ్వి తదితరులు
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : ఐ అండ్రూ
బ్యానర్ : క్రియేటివ్ కమర్షియల్స్
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాత : కే ఎస్ రామారావు

రేటింగ్: 2.5

రివ్యూ: రమేష్ వర్మ గొల్లపల్లి