తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తా.. వార్నింగ్‌!

బోనీ కపూర్‌ ట్విట్టర్ వార్నింగ్

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సోషల్‌మీడియా ఫాలోవర్స్ కు హెచ్చరిక చేసారు. ఆయన నిర్మాతగా తమిళ దర్శకుడు హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమా కోసం నూతన నటీనటులు కావాలంటూ కొందరు క్యాస్టింగ్‌ కాల్స్‌ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోనీ వారికి వార్నింగ్‌ ఇచ్చారు. అవి తప్పుడు ప్రకటనలని తేల్చారు. ఈ మేరకు తన న్యాయవాది మాటలతో ఉన్న నోటీసును బోనీ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

తమ నిర్మాణ సంస్థ సినిమా కోసం ఎటువంటి క్యాస్టింగ్‌ కాల్స్‌ నిర్వహించడం లేదని నోటీసులో బోనీ పేర్కొన్నారు. దానికి సంబంధించి ఎటువంటి సందేశాలు కూడా షేర్‌ చేయలేదని, అవన్నీ తప్పుడు పోస్టులని తెలిపారు. ఇలాంటి ఫేక్‌ క్యాస్టింగ్‌ కాల్స్‌కు స్పందించి, నష్టపోతే తమ నిర్మాణ సంస్థ బాధ్యత వహించదని అన్నారు.

బోనీ ఇటీవల హిందీ హిట్‌ ‘పింక్‌’ను తమిళం రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. అజిత్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతోపాటు మంచి వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత బోనీ.. హెచ్‌. వినోద్‌ ప్రాజెక్టును ప్రకటించారు. మరోపక్క ఆయన తమిళ హిట్‌ ‘కోమలి’ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో బోనీ కుమారుడు అర్జున్‌ కపూర్‌ నటించనున్నారు.