జుట్టు కత్తిరించుకున్న సోనాలి బింద్రే.. భావోద్వేగంతో ఇలా పోస్ట్ పెట్టింది.

క్యాన్సర్ తో పోరాడుతున్న నటి సోనాలి బింద్రే చికిత్స నిమిత్తం తన జుట్టును కత్తిరించుకున్నారు. భావోద్వేగానికి లోనైన సోనాలి తన ఫోటోలను ఇంస్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ కష్ట సమయంలో తనకి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు.

నా అభిమాన రచయిత్రి మాటలు గుర్తొస్తున్నాయి. ‘మనలో దాగివున్న బలాన్ని ముందుకు తీసుకువచ్చేవరకు మనకు తెలియదు మనం ఎంత దృఢమైన వారిమో. యుద్ధ సమయంలోను, కష్టం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు ప్రజలు అద్భుతాలు చేస్తారు. జీవనానికై మనిషికి ఉన్న సామర్ధ్యం గొప్పది’. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. స్ఫూర్తివంతమైన కధలు పంపుతూ నాలో మనోధైర్యాన్ని పెంచుతున్న వారందరికీ నేను రుణపడి ఉంటాను. మీ కథలు నాలో మరింత ఉత్తేజాన్ని, ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. నేను ఒంటరిని కాదు అని గుర్తు చేస్తున్నాయి. ప్రతి రోజు ఒక సవాలుతో కూడుకున్నది. నేను మాత్రం సానుకూల దృక్పధంతో స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజు సూర్యోదయం కోసం ఎదురు చేస్తున్నాను. నా ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవటం కూడా ఒక సవాలులాంటిదే. ఈ విధంగా ఆమె పెట్టిన పోస్టు అభిమానుల కంట నీరు పెట్టించింది.