జంటగా ఈ జంట రెండు సినిమాలు వెంటవెంటనే

పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పకుండా కెరీర్ కొనసాగిస్తుంది నటి సమంత. పెళ్ళికి ముందు ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇటు చైతన్య కూడా సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాల షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. వెంకీ మామతో బాబీ డైరెక్షన్లో మల్టీ స్టారర్ మూవీకి సిద్ధమయ్యాడు. తాజగా వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో జంటగా నటించనున్నట్టు ఫిలిం నగర్లో టాక్.

గత కొద్దిరోజుల క్రితం సమంత నటనకు గుడ్ బై చెప్పనుంది అనే వార్త గుప్పుమంది. అవన్నీ ఫేక్ న్యూస్. త్వరలోనే మేమిద్దరం కలిసి జంటగా ఒక సినిమాలో నటించబోతున్నాం అంటూ…సమంత గురించి వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశాడు చైతు. ఆ సినిమాకు నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత మొదటి సినిమా కో స్టార్ కం ఫ్రెండ్ అయిన రాహుల్ రవీంద్రన్ ‘చి ల సౌ’ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఉంటుందని ప్రకటించాడు. అయితే ఈ సినిమాని సమంత నాగచైతన్య కాంబినేషన్లో తీయడానికి రాహుల్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇది ఓకే అయితే వీరు జంటగా నటించే  రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యే అవకాశం ఉండొచ్చు.