చెర్రి స్కెచ్ బాగానే ఉంది కానీ త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా?

మెగాస్టార్‌ను ఇంటర్వ్యూ చేయనున్న మెగా డైరెక్టర్?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `సైరా` . ఈ సినిమా బుధవారం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంపాదించుకుని సూపర్‌హిట్‌గా దిసగా పరుగులు పెడుతోంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్ సరిగా చేయటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ సరిగ్గా ఉంటే ఇంకా కలెక్షన్స్ కుమ్మేసేవని మెగాభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు మరింత ప్రచారం కల్పించి కలెక్షన్లు మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అతి త్వరలో ఈ చిత్రం టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించబోతోంది. ముఖ్యంగా టీవిల్లో ఈ సినిమా గురించి ఇంటర్వూలతో బూస్టప్ ఇవ్వనున్నారు. అయితే చిరంజీవి ఇంటర్వూ అంటే రొటీన్ గా అనిపించకుండా, అలాగే ఇంటర్వ్యూ లాగ కాకుండా ఓ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్ కాంబినేషన్‌లో ఓ పోగ్రామ్ చేస్తే బాగుంటుందని ఓ టీవి ఛానెల్ వాళ్లు సలహా ఇచ్చారట. దాంతో ఆ విషయమై ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ డైరక్టర్ ఎవరూ అంటారా.

ఇంకెవరు మెగా కుటుంబానికి సన్నిహితుడైన త్రివిక్రమ్. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత ఇంటర్వ్యూ చేయిస్తే బాగుంటుందని ప్లాన్ చేయిస్తోందిట సైరా టీమ్. త్రివిక్రమ్ ఎలాగూ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఒప్పుకునే అవకాసం ఉందంటున్నారు. ఈ చిట్ చాట్ లాంటి ఈ ఇంటర్వూ తెలుగునాట `సైరా`కు కచ్చితంగా ప్రమోషన్ ఇస్తుందని ఉపయోగపడుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles