`సైరా నరసింహారెడ్డి` తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై హీరో రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభ్యుదయ భావాలున్న దర్శకుడు కొరటాల శివ తొలి చిత్రం నుంచి తన సినిమాల్లో ఏదో ఒక సామాజిక సందేశాన్నిజోడించి కమర్షియల్ ఎంటర్టైనర్లని అందిస్తున్నాడు.
తాజా చిత్రాన్ని కూడా నక్సలిజం నేపథ్యంలో రూపొందిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి గోవింద్ ఆచార్య అనే ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్నారు. రామ్‌చరణ్ ఓ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కోకా పేటలో వేసిన విలేజ్ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ లొకేషలో కామ్రేడ్ గెటప్‌లో కనిపిస్తున్న ఓ ఫొటో ఒకటి బయటికి వచ్చేసింది. దీంతో సినిమాలో రామ్‌చరణ్ పక్సలైట్గా కనిపించడం లేదని, చిరునే నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారని అర్థమవుతోంది.
ఈ చిత్ర టీమ్ మాత్రం చిరు నక్సలైట్ పాత్ర చేయడం లేదని, ప్రజానాట్యమండలి కార్యకర్తగా నటిస్తున్నాడని చెబుతున్నారు. దేవాదాయ శాఖ భూ కుంభ కోణానికి సంబంధించిన ఓ భారీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, రామ్‌చరణ్ కీలక అతిథి పాత్రలో నక్సలైట్ నాయకుడిగా కనిపించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.