Home Tollywood చిరు ని తట్టుకోవటం మామూలు విషయం కాదు

చిరు ని తట్టుకోవటం మామూలు విషయం కాదు

‘సైరా’ సునామీకి చాణుక్య నిలబడగలడా?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘సైరా’. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. భారీ అంచనాలతో అట్టహాసంగా నిన్న బుధవారం నాడు విడుదల అయింది. . సాధారణ ప్రేక్షకుల నుండి ఇటు సినీ విమర్శకుల వరకు సైరా చిత్రం పై, చిరు నటనపై మరియు దర్శకుడు సురేంధర్ రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు తగినట్లే కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.

ఈ సైరా ప్రభావం …రేపు శుక్రవారం రిలీజ్ కానున్న గోపీచంద్ తాజా చిత్రం చాణుక్యపై ఉండబోతోందా అనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో కలుగుతోంది. రాబోయే రోజుల్లో సైరా కలెక్షన్స్ పెరిగే వాతావరణం కనపడుతోంది. ఇప్పటికే వీకెండ్ మొత్తం బుక్ అయ్యిపోయింది.ఈ వేడి ఈ వారాంతమే కాదు దసరా శెలవలు అయ్యేదాకా ..తగ్గేటట్లు లేదు. దాంతో వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న గోపీచంద్ కు ఏ మేరకు తన సినిమాకు ఓపినింగ్స్ వస్తాయో కూడా అర్దం కాని పరిస్దితి. చాణుక్య తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ తో సైరా వైపు చూస్తున్నారు. అయితే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చాణుక్య బాగుంది. ఖచ్చితంగా భాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందందని చెప్తున్నారు.

ఇక చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ అద్భుతమైన నటనతో హృదయాలను కదిలించేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోశాడని అంతటా స్ప్రెడ్ అవుతోంది. దాంతో ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ తరవాత వచ్చే సినిమాలపై ఉంటుంది. అది చాణుక్య కావచ్చు ..మరొకటి కావచ్చు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News