Home Tollywood గుమ్మందాకా వచ్చి ‘గద్దలకొండ గణేష్’ వెనుతిరిగాడు

గుమ్మందాకా వచ్చి ‘గద్దలకొండ గణేష్’ వెనుతిరిగాడు

‘గద్దలకొండ గణేష్’బ్రేక్ ఈవెన్ కష్టమని తేలిపోయింది

‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న ‘వాల్మీకి’ సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చినా ఓపినింగ్స్ బాగుండటం కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ కూడా మాస్ టచ్ తో బాగానే రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని మీడియా మాట్లాడటం మొదలెట్టింది. సినిమా టీమ్ సరేసరి…విజయయాత్రలని మరొకటి అని అంటూ మీడియాలో సినిమాని నిలబెట్టాలని ప్రయత్నం చేసింది.

దాంతో ఫస్ట్ వీకెండ్లోనే ఈ చిత్రం రూ.16 కోట్ల దాకా షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యాక కూడా కలెక్షన్స్ కొంచెం నిలకడగానే ఉన్నాయనుకునే లోపల దెబ్బ పడింది. ఈ వీకెండ్లో కూడా కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఇదే బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొస్తుందని అంచనా వేసారు. కానీ ‘గద్దలకొండ గణేష్’ ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు.

ఈ సినిమా సెకండ్ వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయింది. రూ.25 కోట్లు షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఈ సినిమా 10 రోజుల్లో రూ.22.3 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది. నిన్న ఆదివారం తర్వాత ఈ చిత్రానికి షేర్ పెద్దగా వచ్చే అవకాశాలు ఇక లేవని అర్దమైపోయింది. ఎందుకంటే… బుధవారమే ‘సైరా’ రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా హంగామా మొదలైపోయింది.

‘గద్దలకొండ గణేష్’ పట్ల జనాల్లో ఇక ఇంట్రస్ట్ కనిపించటం లేదు. దాంతో ఈ రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. షేర్ నామమాత్రంగా ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకోవటం కష్టమే అంటున్నారు. దాంతో బాగా లాభాలు వస్తాయని భావించిన బయ్యర్లకు నష్టాలు రానందుకు సంతోషించాల్సిన పరిస్తిది వచ్చింది. అలాగే ఈ సినిమాతో పెద్ద హిట్ ఖాతాలో వేసుకుంటానని ఆశించిన దర్శకుడు హరీష్ శంకర్‌కు కొంత నిరాశ తప్పలేదు.

- Advertisement -

Related Posts

బన్నీ “పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు. తన పుష్ప సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. రష్మికా మందన్న...

ప్రభాస్ సరసన శృతిహాసన్ .. క్లారిటీ ఇచ్చిన సలార్ చిత్ర యూనిట్ !

లోకనాయకుడు కుమార్తె , స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన శృతిహాసన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే...

ఎవ్వరూ చూడని ఫోటో అడిగిన నెటిజన్.. అలా షాకిచ్చిన సురేఖా వాణి కూతురు

నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి, సుప్రిత కలిసి వేసే టూర్లు, వీకెండ్‌లో చేసుకునే పార్టీలు సోషల్ మీడియాలో...

అందాల రాక్షసి.. పెదాలు కొరికిందా?

అందాల రాక్షసి అనగానే అందరికి గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా అమ్మడు పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. చివరగా చేసిన అర్జున్ సురవరం సినిమా పరవాలేధనిపించే విధంగా మెప్పించింది....

Latest News