బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల గత కొంత కాలంగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని గుత్తా జ్వాల కానీ, విష్ణు విశాల్ ఖండించలేదు. దీంతో మరింతగా రూమర్లు మొదలయ్యాయి. అయినా గుత్తా కానీ, విష్ణు విశాల్ కానీ మీడియా ముందుకు రాలేదు. తమపై వస్తున్న వార్తలపై స్పందించలేదు.
తాజాగా తమ ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరిం డేటింగ్లో వున్నామని, ఇందులో దాచుకోవడానికి అంటూ ఏమీ లేదని, త్వరలో వివాహం చేసుకోబోతున్నామని, మ్యారేజ్ డేట్ డిసైడ్ కాగానే పెళ్లి ఏర్పాట్ల సమయంలో తాము స్వయంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
హైరాంకింగ్ తమిళనాడు పోలీస్ ఆఫీసర్ కుటుంబంలో పుట్టిన విష్ణు విశాల్ 2009లో వచ్చిన `వెన్నెల కబడ్డి కూళం` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ రోజుల్లో రజనీ నటరాజ్‌తో విష్ణు విశాల్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరూ నాలుగేళ్ల పాటు డేటింగ్లో వున్నారు.
తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించడంతో 2011 డిసెంబర్ 2న చెన్నైలో వీరి వివాహం జరిగింది. 2017లో ఒక బాబు కూడా పుట్టాడు. పేరు ఆర్య. 2018 జనవరిలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచే విష్ణు విశాల్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలతో టచ్‌లో వుంటున్నాడు.