Home Tollywood 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) ' హిట్టైనా, కథేంటి

‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) ‘ హిట్టైనా, కథేంటి

వరుణ్ తేజ ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) ‘ టాక్, కథ

మెగా హీరో వరుణ్ తేజ్.. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఈ రోజు రిలీజైన చిత్రం ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) . 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాలో…. తమిళ నటుడు అధర్వ మరో కీలక పాత్ర పోషించారు. శ్రీదేవిగా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించగా..లాస్ట్ మినిట్ లో టైటిల్ మార్పు హాట్ టాపిక్ గా మారింది. టైటిల్ అయితే మార్చాం..ఆ విషయంలో ఓడిపోయాం కానీ సినిమా విషయంలో గెలుస్తామని ఘన విజయం సాధిస్తామని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఈ నేపధ్యంలో విడుదలైన ఈ చిత్రం టాక్, కథ ఏంటో చూద్దాం.

స్ట్రగులింగ్ అసెస్టెంట్ డైరక్టర్ (అధర్వ మురళి) బ్రేక్ కోసం నానా కష్టాలు పడుతూంటాడు. ఈ క్రమంలో అతను ఓ గ్యాంగస్టర్ జీవితంపై సినిమా తియ్యాలని అనుకుంటాడు. అదీ నిజ జీవిత గాధ నుంచి ప్రేరణ పొందాలని గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ) అనే ఓ గ్యాంగస్టర్ జీవితాన్ని దగ్గరగా పరిశీలించాలనుకుంటాడు. అందుకోసం గణేష్ ఉన్న టౌన్ కు వచ్చి అక్కడ గ్యాంగ్ తో కలిసి తిరుగుతూ స్క్రిప్టు రాస్తాడు. అయితే ఈ క్రమంలో గణేష్ కు ఈ విషయం తెలిసిపోతుంది. అక్కడ నుంచి గణేష్ తనపై సినిమా తియ్యటానికి ఒప్పుకుంటాడా…ఏం జరుగుతుంది అనే క్రమంలో కథ జరుగుతుంది.

ఈ చిత్రం పూర్తిగా వరుణ్ తేజను మాస్ గా చూపించటం పనిలో ఉంది. దాంతో ఫస్టాఫ్ పెద్దగా కథ జరిగినట్లు అనిపించలేదు. కానీ ఆ లోటుని సెకండాఫ్ లో తీర్చారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. అయితే మాస్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది అంటున్నారు.

వరుణ్ తేజ విషయానికి వస్తే గద్దలకొండ గణేష్ గా అదరకొట్టాడంటున్నారు. తమిళ రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న క్యారక్టర్ కంటే విభిన్నంగా వరుణ్ చేసాడని సమాచారం. అలాగే హరీష్ శంకర్, వరుణ్‌ను మాస్ లుక్‌లో సూపర్‌గా చూపించాడని ఫ్యాన్స్ సంబరపడిపోతన్నారు. పూజా హెగ్డే ఉన్నది కొద్ది సేపే అయినా కేక పెట్టించిందని, ‘వెల్లువచ్చి గోదారమ్మా’ రీమేక్స్ అందాల ను ఓ రేంజిలో అరబోసిందంటున్నారు. మరో ముఖ్య పాత్రలో నటించిన అధర్వ కూడా బాగానే చేశాడని చెప్తున్నారు.

- Advertisement -

Related Posts

అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన...

కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి...

ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో...

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌...

Latest News