కరోనా విళయతాండవం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెలబ్రిటీలు కార్యక్రమాలని రద్దు చేసుకుంటున్నారు. ఇటీవలే షూటింగ్‌లని కూడా రద్దు చేసుకున్నారు. తాజాగా మోహన్‌బాబు తన బర్తడే వేడుల్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. తాజాగా అదే బాటలో మెగా హీరో రామ్‌చరణ్ కూడా తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంపై ఓ పత్రికా ప్రకటనని బుధవారం రామ్‌చరణ్ పీఆర్ టీమ్ రిలీజ్ చేసింది. `మీకు నా మీద ఉన్న ప్రేమని, నా పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మీరు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలను. మనం వున్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఈ సందర్భంలో మన చుట్టూ జనం తక్కువగా వుండేలా, అధిక సంక్షలో సమూహాలు వుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని మనసులో పెట్టుకుని నా పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాలని నా మనవి` అని రామ్‌చరణ్ ఓ లెటర్‌ని విడుదల చేశారు. దీంతో మెగా హీరో రామ్‌చరణ్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమైంది.