మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం `ఆచార్య`. రామ్‌చరణ్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల చిరుకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆర్ ఎఫ్‌సీలో, కోకాపేట్లో వేసిన కాలనీ సెట్లో పూర్తి చేశారు కొరటాల. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష తప్పుకోవడంతో చిత్ర బృందం చిరు పక్కన పర్ఫెక్ట్ జోడీ కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
ఇప్పటికే కాజల్ అగర్వాల్‌ని రామ్‌చరణ్ సంప్రదించినట్టు తెలిసింది. కాజల్ ఇంతకు ముందు `ఖైదీ నంబర్150`లో నటించింది. దాంతో మళ్లీ కాజల్ నే హీరోయిన్గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. అయితే కాజల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదని, ఈ సారి రెమ్యునరేషన్ భారీగా ఇస్తేనే నటిస్తాని చెప్పేసిందట. కావాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండని నిర్ణయం రామ్‌చరణ్ కి వదిలేసిందట. చేసేది లేక కాజల్ అడిగినంత ఇవ్వడానికి రామ్‌చరణ్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇటీవల వరుస ఫ్లాపుల్లో వున్న కాజల్ ఇలా డిమాండ్ చేయడం ఏంటని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.