ఒకప్పుడు బిజీ హీరోయిన్…ఇప్పుడు ఏంచేస్తుందంటే..
డిజిటల్ లో బిజీ కోసం ప్రియమణి తహతహలాడుతోందిట! ‘పెళ్లైన కొత్తలో (2006)’, ‘యమదొంగ (2007)’, ‘గోలీమార్ (2010)’ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్ లలో ఒకరిగా వెలుగొందింది. అయితే అటు తర్వాత కొత్త ముఖాలు సినీరంగ ప్రవేశము చేయడం తో కాస్త వెనకడుగు వేసింది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
అయితే ఇప్పుడు తాజాగా ప్రియమణి డిజిటల్ లో బిజీ కోసం తహతహలాడుతోందిట! ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సీరీస్ లో నటించడం కూడా మొదలు పెట్టింది. ఈ సీరీస్ లో ప్రియమణి తో కలిసి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకుడు. మనోజ్ బాజ్ పాయ్ కి కుడా ఇదే వెబ్ సీరీస్ కావడం విశేషం! ఇదిలా ఉంటే ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ అమ్మడు ఈ విధంగానైనా డిజిటల్ లో బిజీ అవుతుందని ఆశిద్దాం!