స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత విరామం తరువాత `అల వైకుంఠపురములో` చిత్రంతో ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడం. ముందు నుంచి ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ డౌట్‌గానే వుండటం వంటి కారణాలతో ఈ సినిమా తరువాత బన్నీ ఆలోచనలో పడ్డారట. దాంతో తరువాత సినిమాకు గ్యాప్ ఏర్పడింది. అయితే తనకు వచ్చిన గ్యాప్ కు సంబంధించిన అసలు సీక్రెట్‌ని సోమవారం జరిగిన `అల వైకుంఠపురములో` మ్యూజిక్ కాస్సర్ట్లో బన్నీబయటపెట్టేశాడు.
సినిమా టీజర్‌లోని `ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్…ఇవ్వలా అదే వచ్చింది..`అనే డైలాగ్‌ని చెబుతూనే అది డైలాగ్ కాదు తన జీవితంలో జరిగిన సంఘటనే అని అసలు సీక్రెట్ చెప్పేశాడు. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారని అంతా తనని అడిగారని, అలా అడిగిన వారికి తాను చెప్పేది ఒకటే అని. సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రాల తరువాత సరాదాగా వుండే సినిమా చేయాలి, ఈజ్ వుండాలి. అనుకున్నాడట. అయితే ఎన్నికథలు విన్నా బన్నీకి సుఖంగా అనిపించలేదట. అలాంటి కథ సెట్ కావడానికి త్రివిక్రమ్ ఖాళీ అయి సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టిందట.
అందుకే ఈ గ్యాప్ అని, రిలీజ్లో గ్యాప్ వుంటుందేమో కానీ సెలబ్రేషన్స్‌లో మాత్రం గ్యాప్ వుండదు అని `అల వైకుంఠపురములో` సక్సెస్ గ్యారంటీ అంటూ కాన్ఫిడెంట్‌గా వున్నాడు బన్నీ. `అల వైకుంఠపురములో` ఈ నెల 12న సంక్రాంతి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.