ఎక్కడ కెరీర్ వుంటే అక్కడే ఓ ఇల్లు కట్టుకోవడం బెస్ట్ అంటోంది అందాల నాయిక రాశీఖన్నా. ఆమె నటించిన చిత్రాలు ఇటీవల బాగానే విడుదలవుతున్నాయి. సినిమా హిట్టయినా ఫట్టయినా ఆమెకు ఏ సంబంధం లేకుండా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో తన స్టార్ ఇప్పట్లో బాగానే ఉందన్న ముందుజాగ్రత్తతో, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా వుండాల్సి వస్తోందన్న బాధతో రాశీఖన్నా ఎక్కడుంటే అక్కడే ఇల్లు కట్టుకుంటోందట.
ఇటీవల సిటీ సరిహద్దుల్లో ఆమె మరో ఇంటి స్థలాన్ని కూడా కొనుగోలు చేసిందట ఎప్పుడు టాలీవుడ్‌కు అందుబాటులో వుండేలా సన్నాహాలు చేసుకుంటోంది. ఏది ఏమైనా బాలీవుడ్‌నుండి వచ్చిన అమ్మాయిలు ముందు జాగ్రత్తతో వుంటారన్న నిజాన్ని రాశీఖన్నా కూడా రుజువు చేస్తోంది.