కరోనా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. సహాయం చేయాలంటే ఒకటికి పది సార్తు ఆలోచించే జనాల్లో మార్పుని తెచ్చింది కరోనా. ఇక లాక్డౌన్ సమయంలో ఇంటి పట్టునే వుంటున్న సెలబ్రిటీలు ఈ సమయాన్ని ఎవరికి తోచినట్టు వారు వాడుకుంటున్నారు. కొంత మంది హీరోయిన్లు చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తూ ఛాలెంజ్ చేస్తుంటే మరి కొంత మంది దర్శకులు కొత్త కథలు రాస్తున్నారు.
అయితే ఓ దర్శకుడు మాత్రం విచిత్రంగా కొత్త కోర్సలో జయిన్ అయిపోయాడు. ఇది పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దర్శకులంతా కొత్త కథలు, కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిపెడుతుంటే దర్శకుడు తేజ మాత్రం తనకు ఏమాత్రం సంబంధిం లేని కోర్సుని నేర్చుకుంటున్నారు. ప్రపంచాన్ని కోవిడ్ 19 వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో `వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్` ఊపిరితిత్తులకు సంబంధించిన ఓ కోర్స్‌ని అందిస్తోంది. దీనికి ఆన్లైన్లో అప్లై చేసిన తేజ ప్రస్తుతం ఈ లాక్డౌన్ సమయంలో ఈ కోర్సుని నేర్చుకుంటున్నారు.
భవిష్యత్తులో వైరస్లు ప్రబలితే వాటి నుంచి ఎలా తనని తాను కాపాడుకోవాలా? .. వైరస్లని ఎలా ఎదుర్కోవాలా అని ఈ కోర్స్ ద్వారా తేజ తెలుసుకోబోతున్నారట. తేజ ఇటీవల రెండు ప్రాజెక్ట్‌లని ప్రకటించిన విషయం తెలిసిందే. రానాతో `రాక్షసరాజు రావణాసురుడు`, గోపీచంద్‌తో అలిమేలు మంగ వెంకటరమణ చిత్రాలు చేయబోతున్నారు.