ఈసారి ఫ్యాన్స్ జగపతిబాబును క్షమించరు.

ఈమాట మేము చెబుతున్నది కాదు. స్వయంగా జగపతిబాబే చెప్పాడు. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం పొందారు జగపతి. హీరోగా నటిస్తుండగానే కొన్నేళ్ల కిందట వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. లెజెండ్ మూవీలో చేసిన విల్లన్ పాత్ర మంచి బ్రేక్ ఇచ్చింది ఆయనకి. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఆఫర్లు వచ్చాయి. నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, నిన్నటి రంగస్థలం మూవీలలో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఈ విధంగా లెజెండ్ మూవీ నుండి జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు అని చెప్పవచ్చు.

ప్రస్తుతం బెల్లకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న సాక్ష్యం మూవీలో విలన్ గా నటిస్తున్నారు జగపతిబాబు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ డబ్బు కోసం ఎంత క్రూరమైన పనులు చేయడానికైనా వెనుకాడని ఒక మూర్ఖుని తరహాలో ఉంటుందని వెల్లడించారు. ఆ క్యారెక్టర్లో నన్ను చూసి ఇంత నీచుడేంటి అని ప్రేక్షకులు తిట్టుకుంటారు. ఇప్పటివరకు నేను చేసిన విలన్ పాత్రలు చూసి ప్రేక్షకులు క్షమించారు కానీ ఈసారి నన్ను క్షమించరు అని అన్నారు జగపతిబాబు.