ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ షేర్

వర్కింగ్ డేస్ లోనూ ‘సైరా’ హవా

భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందిన ‘సైరా’ ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా మిగతా చోట్ల ప్రక్కన పెడితే తెలుగులో మాత్రం విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఇక 9వ రోజైతే సుమారు రూ.3.1 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ వసూళ్లలో అత్యధికంగా నైజాం నుండి రూ.1.3 కోట్లు వసూలు కాగా ఉత్తరాంధ్ర నుండి రూ.60 లక్షలు వచ్చాయి. రెండవ వారం , అదీ వర్కింగ్ డే రోజున ఈ స్థాయి వసూళ్లను సాధించగలగడం నిజంగా విశేషమే అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ చూసిన వారు చిరు స్టామినా ఏపాటిదో అంచనా వేస్తున్నారు. ఈ రన్ ఇలాగే కొనసాగితే త్వరలోనే చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటే అవకాశాలున్నాయి.

<

p style=”text-align: justify”>మరో ప్రక్క ‘సైరా’కి పోటీగా భావించదగిన సినిమాలేవీ విడుదల కావటం లేదు. ఈ వారం రిలీజైన ఆర్ డీఎక్స్ లవ్, వదలడు రెండు సినిమాలు తేడాగానే ఉన్నాయి. దాంతో ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చు. అయితే తెలుగులో మాత్రమే వర్కవుట్ కావటంతో మెగా అభిమానుల్లో కాస్త ఉషారు తగ్గింది. అయితే ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.