ఇక్కడ పవన్, అక్కడ కమల్ హాసన్

కమల్ వాయిస్ ఓవర్ తో చిరు చిత్రం

చిరంజీవి నటించిన చారిత్రాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం సైరా నరసిహారెడ్డి. సైరా చిత్రం తెలుగుతో పాటు, తమిళం,హింది, మలయాళ, కన్నడ భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేధీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఆర్‌బీ.చౌదరి సొంతం చేసుకున్నారు.

ఈ నేపధ్యంలో తమిళ వెర్షన్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ విషయం చిరంజీవి రివీల్ చేసారు. అదేమిటంటే ఈ సినిమాకు ముందు మాటను నటుడు కమలహాసన్‌ చెప్పారన్నారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తెలుగులో అదే ముందు మాటను పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక తమిళ వెర్షన్ కు గానూ చిరంజీవికు డబ్బింగ్ అరవింద స్వామి చెప్పటం జరిగింది.

ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచేస్తూ రీసెంట్ గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఈ ట్రైలర్‌ అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్‌ సీన్స్‌లో చిరు లుక్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయని ఫ్యాన్స్ ముచ్చటపడిపోయారు.

చిరు తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్‌ కథను సమకూర్చగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కన్నడ నటుడు సుధీప్, తమిళ నటుడు విజయ్‌సేతుపతి, జగపతిబాబు, నటి నయనతార, తమన్న వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.