ఆ దర్శకుడికి అండగా దిల్ రాజు, త్రివిక్రమ్

సినీ పరిశ్రమలో ప్రతిభ యే మహారాజు. దానితో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి వస్తే పెద్ద పెద్ద నిర్మాతలే ఇంటి తలుపు తడతారు. ఇందుకు ఉదాహరణ అప్పుడు సందీప్ వంగా ఇప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

సున్నితమైన హాస్యం అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా చూసి దర్శకుడు త్రివిక్రమ్ మరియు నిర్మాత దిల్ రాజు మెచ్చుకుని అతన్ని దర్శకుడిగా పెట్టుకోమని నిర్మాణ సంస్థలకు సిఫారసు చేస్తున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేయనుంది.