బన్నీ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `ఆర్య`. ఒకరు ప్రేమించిన అమ్మాయిని మధ్యలో వచ్చి తను కూడా ప్రేమిస్తున్నానని వెంటపడే హీరో కథ. ముందు ఇది విచిత్రంగా అనిపించినా మెల్ల మెల్లగా వన్ సైడ్ లవర్స్ బాగా కనెక్ట్ కావడంతో హిట్ సినిమా అయిపోయింది. ఇక ఆ తరువాత చేసిన `ఆర్య-2` కూడా అంతే తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. నమ్మించి పెళ్లి కూడా చేసుకుంటాడు.. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా పేలలేదు.
హీరోని నెగెటివ్ షేడ్స్‌తో ప్రజెంట్ చేయడం అనేది `ఆర్య` నుంచి మొదలుపెట్టిన సుకుమార్ తాజాగా బన్నీతో ముచ్చటగా మూడవ సారి చేస్తున్న సినిమా `పుష్ప`లోనూ అదే ఫార్ములాను వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు విడుదల చేసిన సెకండ్ స్టిల్‌లో అది స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల మధ్య గంధపు చెక్కల దొంగగా నేలపై ఎలాంటి బెరుకు లేకుండా బన్నీ చూస్తున్న తీరు ఇందుకు అద్దంపడుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ మాసీవ్ పాత్రలో కనిపిస్తున్నాడు. డంధపు చెక్కల్ని తరలించే లారీ డ్రైవర్‌గా అతని పాత్ర వుంటుందని తెలుస్తోంది.
బన్నీ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రియలిస్టిక్ అప్రోచ్‌తో పక్కాగా చెప్పాలంటే `రంగస్థలం` తరహా మేకింగ్‌తో పిరియాడిక్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎవ్వరి మాట వినని మొరటోడిగా, డబ్బ కోసం ఎందకైనా తెగించే వ్యక్తిగా బన్నీ పాత్రని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అదే ఇజమైతే తెలగు, తమిళ, మలయాళ, కన్నడ, మిందీ భాషల్లో ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయం.