రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటారు. కానీ ఆ ఒక్కటి నాకు వర్తించదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు డి. సురేష్‌బాబు. థియేటర్ల లీజ్ దగ్గరి నుంచి చిన్న సినిమాల రిలీజ్‌ల వరకు సురేష్‌బాబు వేలు పెట్టని వ్యవహారం లేదు. ప్రతీ విషయాన్ని(డబ్బులు వచ్చేది ఏదైనా) బూతద్దంలో పెట్టిమరీ చూసే ఆయన ఈ మధ్య ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లు ముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా నెల రోజులకే సినిమాలని రిలీజ్ చేసేస్తున్నాయని దాని కారణంగా థియేటర్లలో రన్నింగ్‌లో వున్న సినిమా కలెక్షన్లు పడిపోతున్నాయని సురేష్‌బాబు ఆ మధ్య మండిపడ్డారు.
ఇకపై 50 రోజుల తరువాతే తీసుకున్న చిత్రాల్ని ప్రదర్శించాలని, దీనికి ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్‌ని పాస్ చేయాలని నానా హడావిడీ చేశారు. మీడియా సాక్షిగా ఇన్ని మాటలు చెప్పిన సురేష్‌బాబు తన దాకా వచ్చేసరికి ప్లేటు మార్చేయడం షాక్‌కు గురిచేస్తోంది. ఆయన నిర్మించిన `వెంకీమామ` డిసెంబర్ 13న రిలీజ్ అయింది. సరిగ్గా నెల తిరక్కుండానే ఈ నెల 13న ఈ చిత్రాన్నిఅమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్కి పెట్టేసింది. దీంతో నీతులు చెప్పిన సురేష్‌బాబు ప్లేట్ ఫిరాయించడం చూసి సినీ వర్గాలు తెల్లముఖం వేస్తున్నాయి. నీతులు మాకేనా? మీకు వర్తించవా? అని మండిపడుతున్నారు.
ఈ తప్పు నాది కాదని, ఆ తప్పు ఆమెజాన్ ప్రైమ్ వారి అత్యుత్సాహం వల్లే జరిగిందని. ముందు చేసుకున్న ఒప్పందాన్ని వారు ఉల్లంఘించారని మళ్లీ కొత్త కథ వినిపిస్తారేమో చూడాలి.