అమ్మకానికి రామానాయుడు స్టూడియో సిద్ధమవుతోంది. గత కొన్ని దశాబ్దాల పాటు రామానాయుడు హయంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్కడ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వరకు ఓపెనింగ్లు జరుపుకున్నాయి. ఫ్లోర్లలో నిత్యం షూటింగ్‌లతో రద్దీగా వుండే రామానాయుడు స్టూడియో గత కొంత కాలంగా కళ తప్పింది. దానికి కారణం రామానాయుడు పెద్ద కుమారుడు డిజ సురేష్‌బాబు వల్లే నని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఏ పని చేసినా అందులో లాభం చూసుకుని మాత్రమే చేసే సురేష్‌బాబు గత కొంత కాలంగా ఫిల్మ్ నగర్లో వున్న స్టూడియోలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూషన్ కంపనీని రన్ చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్‌లు నామ మాత్రంగానే జరుగుతున్నాయి. నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌ని ఆనుకుని వున్న చెరువుని కబ్జా చేసిన సురేష్‌బాబు ఆ స్థలాన్ని ఓ కార్పెరేట్ సంస్థకు కట్టబెట్టారు. ఇది తెలిసికూడా ప్రభుత్వ పెద్దలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
పక్కా బిజినెస్‌మేన్ అయిన సురేష్‌బాబు ప్రైమ్ లొకేషన్లో వున్న తమ స్టూడియో స్థలాన్ని ఎప్పికైనా తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఇవ్వమనే ఛాన్స్ వుంది కాబట్టి ఆ లోపే అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశాడట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఓ ప్రకటన చేశారు. గతంలో స్టూడియోలు జనావాసాలకు దూరంగా వుండేవి..సిటీ పెరగం వల్ల అవి ఇప్పుడు జనావాసాల మధ్యకు చేరుకున్నాయి. ఆ స్థలాలని తిరిగిప్రభుత్వానికి అప్పగిస్తే జనావాసాలకు దూరంగా మరో స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. అదే సురేష్‌బాబు స్టూడియోని మీనాక్షి కన్స్ట్రక్షన్ కంపెనీకి డెవలాప్ మెంట్ పేరుతో అమ్మేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.