అమెరికాలో చికిత్స కోసం రానా

‘బాహుబలి’ లో కండలు తిరిగిన శరీరంతో రానా చేసిన యుద్ధాలు ఇంకా ఎవరూ మర్చిపోలేరు. చూడడానికి అంత ఫిట్ గా కనిపించే రానా కి కూడా ఆరోగ్య సమస్య ఉంది నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజమే.
రానా గత ఏడాదిన్నర కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడట.

ప్రస్తుతం దానికి చికిత్స కోసం అమెరికాలో ఉన్నాడు. అయితే దాని తాలూకు కిడ్నీ మరోఇది చేయాలా లేక మరేదైనా చేస్తే సరిపోతుందా అనేది ఇంకా తెలీదు. ప్రస్తుతం రానా తల్లిదండ్రులు లక్ష్మి, సురేష్ బాబు కూడా అమెరికాలో అతనితో పాటే ఉన్నారు. తనకు ఈ సమస్య ఉందని సోషల్ మీడియాలో ఒకసారి వెల్లడించాడు రానా