అఫీషియల్ : ‘సైరా’రైట్స్ ..ఆ ఛానెల్ కే

బుల్లితెరపై ‘సైరా’..ఏ ఛానల్ లో అంటే?

భారీ ఎక్సపెక్టేషన్స్ నడుమ నిన్న విడుదలైన ‘సైరా’ చిత్రం అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్లాలో బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో ఋజువు అవుతూ సాగుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ‘సైరా’ మొదటిరోజు కలెక్షన్స్ అల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాయి. దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.

దాంతో డిజిటల్ మార్కెట్ లో ఈ సినిమాకు ఒక్క సారిగా క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఈ నేపధ్యంలో శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు జెమినీ టీవీతో భారీ డీల్ జరిగిందని సమాచారం. తాము సైరా హక్కులను సొంతం చేసుకున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది జెమినీ ఛానల్.

బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి విడుదలైన ప్యాన్ ఇండియా చిత్ర రిజల్ట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు.సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం పట్ల చిరు, రామ్ చరణ్, మొత్తం యూనిట్ సభ్యులు సంతృప్తికరంగా ఉన్నారు.