Gallery

Home Tollywood అనిల్ సుంక‌ర భ‌య‌ప‌డిందే జ‌రిగిందా?

అనిల్ సుంక‌ర భ‌య‌ప‌డిందే జ‌రిగిందా?

మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ సంక్రాంతికి బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి అస‌లు నిర్మాత అనిల్ సుంక‌ర‌. స‌పోర్ట్ కోసం దిల్ రాజు పేరుని మరో నిర్మాత‌గా వేశారు. అలా చేస్తే నైజాంతో పాటు ఇత‌ర ఏరియాల్లో థియేట‌ర్స్ ఇబ్బంది వుండ‌దు కాబ‌ట్టి. జ‌న‌వ‌రి 11న రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` ముందు వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించింది. అయితే మేక‌ర్స్ 200 వంద‌ల కోట్లు దాటింద‌ని, ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ అని వ‌రుస పోస్ట‌ర్‌ల‌ని వ‌దిలి నానా హంగామా చేశారు.

మ‌హేష్ సినిమా రిలీజ్ త‌రువాత ఫ్యామిలీతో క‌లిసి అమెరికా చెక్కేశాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్ర‌మోష‌న్స్ అక్క‌డితో ఆగిపోయాయి. ఈ సినిమాకు పోటీగా ఒక్కరోజు తేడాతో జ‌న‌వ‌రి 12న‌ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజైంది. పాట‌ల ద‌గ్గ‌రి నుంచే ప‌క్కా స్కెచ్‌తో అల్లువారి టీమ్ మ్యానిప్లేటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఎక్క‌డ చూసినా `అల వైకుంఠ‌పుర‌ములో` పాట‌లు, సినిమాపేరు మాత్ర‌మే వినిపించేలా ఊద‌ర‌గొట్టేసింది. దీంతో సినిమాలో స‌రుకు లేక‌పోయినా ఆ సినిమా పేరే ప్ర‌ధానంగా వినిపించ‌డం మొద‌లైంది. రిలీజ్ డేట్‌ని ఒక్క రోజు ముందుకు జ‌రిపి `స‌రిలేరు నీకెవ్వ‌రు`కు పోటీగా జ‌న‌వ‌రి 11నే రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ప‌రిస్థితిని ముందే ఊహించిన అనిల్ సుంక‌ర దిల్ రాజుని రంగంలోకి దింపి ప‌రిస్థితిని చ‌క్క‌బెట్ట‌డంతో ముందు అనుకున్న‌ట్టే జ‌న‌వ‌రి 12నే `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజ్ అయింది.

ఆ త‌రువాత నుంచి కూడా `అల వైకుంఠ‌పుర‌ములో`టీమ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మైండ్ గేమ్ ఆడ‌టం మొద‌లుపెట్టింది. సంక్రాంతికి వీళ్ల‌తో పోటీ అంటే ఎలాగైనా దెబ్బ‌కొడ‌తార‌ని ముందే ఊహించి థియేట‌ర్ల కోసం దిల్ రాజుని ప‌క్క‌న పెట్టుకున్నాడ‌ట అనిల్ సుంక‌ర.. అయినా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో హీరో మ‌హేష్ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో స‌రిలేరు టీమ్ మ‌ధ్యలోనే చేతులు ఎత్తేయాల్సి వ‌చ్చింది. ఇలా జ‌రుగుతుంద‌ని అనిల్ సుంక‌ర ముందే భ‌య‌ప‌డ్డాడ‌ట‌. చివ‌రికి ఆయ‌న భ‌య‌మేనిజం కావ‌డంతో స‌రిలేరు టీమ్ చ‌డీ చ‌ప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయింది.

- Advertisement -

Related Posts

‘మ్యాస్ట్రో’ ప్యాకప్… జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నితిన్!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో కూడా హీరో నితిన్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చెక్, రంగ్ దే రెండు చిత్రాలు విడుదలచేసి, ఇప్పుడు...

చిరంజీవి సినిమా టైటిల్ తో కార్తికేయ కొత్త సినిమా..! పోస్టర్, టైటిల్ రిలీజ్

కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కాసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయింది. అప్పటినుంచీ కార్తికేయ హీరోగా వరుసగా సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం...

వయసు మళ్ళిన హీరోయిన్ కూడ బాలకృష్ణ సినిమాకు నో చెప్పిందా ?

మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.  అందునా బాలకృష్ణ చిత్రాలకు కథానాయికలు దొరకడం ఇంకా క్లిష్టమైంది.  'అఖండ' చిత్రానికి హీరోయిన్ ను తీసుకురావడానికి ఆ చిత్ర దర్శకుడు బోయపాటి...

Latest News