అడివి శేష్ వరుస చిత్రాలివే

అందాల హీరో అడివి శేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కాస్త ఉన్న హీరోలందరిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తాడని, మూస చిత్రాలకు దూరంగా ఉంటాడని అందరి అభిప్రాయం. ఆయన కూడా దానిని నిజం చేయడానికే ప్రయత్నిస్తున్నాడు కూడా. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఎవరు’ సినిమా ఆగష్టు 2 న విడుదల కానుంది.
అటు తర్వాత ‘మేజర్’ అనే సినిమా, హీరో మహేష్ బాబు సొంత బ్యానర్లో చేస్తున్నాడు. ఈ చిత్రం ముంబై పేలుళ్లకు సంబంధించిన ఒక మేజర్ యదార్ధ గాథ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్లో ఉంది. ఈ ఏడాది చివరిలో విడుదల కావచ్చు.
తాజాగా ‘గూఢచారి’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దాని సీక్వెల్ అంటే, అంచనాలు బాగానే ఉంటాయి. మొత్తానికి సినిమాలు వరుసగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ను చక్కదిద్దుకుంటున్నాడు ఈ యువ హీరో.