అడివి శేష్ ‘ఎవరు’ పోస్టర్

అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఆగష్టు లో విడుదల అవుతుంది. అడివి శేష్ గత చిత్రం ‘గూఢచారి’ పెద్ద విజయం సాధించడం వల్ల ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు వెంకట్ రాంజీ మొదటి సినిమా ఇది.

పీవీపీ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగష్టు లో విడుదల అయ్యే సినిమాల్లో ప్రేక్షకులు ఎదురు చూసే ఒక సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. సాహో వంటి సినిమాలతో పోటీ పడి ఈ సినిమా నెగ్గుకురాగలదా అంటే వేచి చూడాల్సిందే