Home Bhageeradha - Memoirs with Tollywood "అప్పుడు నటిగా పనికి  రానున్నారు . ఇవ్వాళ  మహానటి అంటున్నారు" సావిత్రి 

“అప్పుడు నటిగా పనికి  రానున్నారు . ఇవ్వాళ  మహానటి అంటున్నారు” సావిత్రి 

    ఈరోజు మహానటి సావిత్రి 82వ జయంతి

నటిగా శ్రీమతి సావిత్రి ముద్ర తెలుగు సినిమా మీద ఎప్పటికీ చెరిగిపోదు . చిన్నప్పుడు నాటకాల్లో నటించిన సావిత్రి 1950లో సంసారం చిత్రంలో మంచి పాత్రలో అవకాశం వచ్చి కూడా చేజారి పోయింది. అదే సినిమాలో చిన్న పాత్రలో నటించాల్చిన పరిస్థితులు వచ్చాయి . ఆ తరువాత రూపవతి, పాతాళ భైరవి సినిమాల్లో కూడా చిన్న  పాత్రల్లోనే  కని పించింది .

పెళ్లిచేసి చూడు సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యింది . అక్కడ నుంచి సావిత్రి సినిమా జీవితం మొదలైంది .  1953లో తన 17 సంవత్సరాల వయసులో దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర ధరించింది . దేవదాసు తండ్రి కాదన్న తరువాత  తన వయసు వున్న పిల్లలున్న ఓ ముసలివాడిని వివాహం చేసుకునే పాత్ర. . నిజానికి 17 ఏళ్ల  అమ్మాయి అలాంటి పాత్రను ధరించి మెప్పించడం సామాన్యమైన విషయం కాదు .  అయితే ఆ తరువాత తనని ఎవరు సినిమా రంగానికి తీసుకొచ్చాడో ఆ పెద్ద  నాన్నతో వచ్చిన మనస్పర్ధలు  ఆమెను జెమినీ గణేశంతో వివాహానికి ప్రేరేపించాయి .  ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని విషాద మయం  చేసింది .

1979వ సంవత్సరం జులై 5 హైద్రాబాద్లో కిన్నెర ఆర్ట్స్ వారు నిర్మాత దుక్కిపాటి  మధుసూదన రావు నేతృత్వంలో  ఘన  సన్మానం చేయడానికి పిలిపించారు . శ్రీమతి సావిత్రి హైదరాబాద్ మద్రాస్ నుంచి వచ్చి హోటల్ అశోకలో దిగారు . ఆరోజు ఉదయం  శ్రీమతి సావిత్రితో నేను   చేసిన ఇంటర్వ్యూ ఇది 

“సావిత్రి గారు నటీనటుల జీవితాల పై వారు నటించిన పాత్రల ప్రభావం ఉంటుందని అంటారు . నిజమేనా ?”

“అక్షరాలా నిజం . అందుకు నా జీవితమే నిదర్శనం . నేను సినిమా రంగంలో ప్రవేశించిన తోలి రోజుల్లోనే బరువైన పాత్రలు , విషాద భరితమైనవి పోషించాను . నా వయసుకు మించిన పాత్రలవి . ఇంటికి వెళ్లిన తరువాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో  నాకు తెలుసు .”

“మీ జీవితానికి పాత్రల ప్రభావానికి సంబంధం ఉందని నిజంగానే మీరు భావిస్తున్నారా  ?”

“అవును .అందుకు సందేహం లేదు . ఆ పాత్రల ప్రభావం వల్లనే నా జీవితం కూడా విషాద మయం అయ్యిందని నేను నమ్ముతాను . నాకు మానవ శక్తి కన్నా దైవ శక్తి మీదనే నమ్మకం “

” మీ మంచితనమే … మీ  ఈ స్థితికి కారణమనే దానితో ఏకీభవిస్తారా ?”

“ఆర్టిస్టులు సహజంగానే సున్నితంగా వుంటారు . అందులో నేను మరీ సెన్సిటివ్ . జీవితం ఎలా జరుగుతుందో ముందే రాసి పెట్టి ఉంటారని అంటారు . అందుకే మన ప్రమేయం లేకుండా అన్నీ జరుగుతూ ఉంటాయి . జరిగిపోయిన దాన్ని గురించి బాధ పడితే మాత్రం తిరిగి వస్తుందా ? నేను ఒకటిన్నర   సంవత్సరం పాటు నటించలేదు  . దానికి ఎన్నో కారణాలు . మానవ జీవితమే పెద్ద విషాదం . అందులో నేను ఓ చిన్న పాత్రధారినిని అనుకుంటా . అందుకే జరగ బోయే జీవితం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నా .”

‘మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ?”

“ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది , మరోసారి ఆనందం అనిపిస్తుంది . చాలా సందర్భాల్లో విషాదం ఆవరిస్తుంది . అయితే జరిగిన ప్రతిదానికీ నాదే భాద్యత , ఇందుకు నేను ఎవరినీ నిందించను . మీకు ఓ విషయం చెప్పనా ?  ఆర్టిస్టు అన్నాక అప్పటికప్పుడు  ఆనందం పలికించాలి , మరు క్షణంలో విషాదం చూపించాలి . కాబట్టి ఆర్టిస్టు ఆనందమైనా , విషాదమైన తెర  మీద  పండించినప్పుడు .. జీవితంలో ఎదురయ్యే వాటిని మాత్రం సమంగా ఎందుకు స్వీకరించకూడదు ?”

“నటిగా మీకు బాగా సంతృప్తి నిచ్చిన సినిమాలు ఏవి ?”

“నేను తెలుగు, తమిళ ,కన్నడ మలయాళ  భాషల్లో 300 చిత్రాల్లో నటించాను .అయితే మనసుకు బాగా నచ్చిన సినిమాలు గా చెప్పాలంటే , దేవదాసు , తోడికోడళ్లు , మిస్సమ్మ గుండమ్మ కథమాయా బజార్కోడలు దిద్దిన కాపురం, అర్ధాంగి , మాంగల్య  బలం ,పాండవ వనవాసం చిత్రాలను చెప్పుకోవచ్చు “

“మీరు దర్శకురాలు గా మారడానికి కారణం ఏమైనా ఉందా ?”

“దర్శకత్వం అనేది సృజనాత్మకమైనది . నాకు చాలా కాలంగా దర్శకత్వం చెయ్యాలనే కోరిక ఉండేది . తెలుగులో మాతృదేవత  , చిన్నారి పాపలు , చిరంజీవి , తమిళంలో ప్రాప్తం (మూగ మనసులు ) కకుండై ఉళ్ళం (చిన్నారి పాపలు ) చిత్రాలు నా అభిరుచికి తగ్గట్టు తీశాను

 

“నటిగా మీరు మర్చిపోలేని సంఘటలు ఏమైనా వున్నాయా?”

“చాలా వున్నాయి . అయితే  నన్ను  మొదట్లో నటిగా పనికి రావు పొమ్మన్నారు , అవమానించారు , వెనుక అవహేళన కూడా చేశారు . .నటనే తెలియదని అన్నారు . అలా అన్న వారే ఈరోజు నన్ను మహా నటి అని కీర్తిస్తున్నారు .

ఈ పాత్ర అయినా సరే సావిత్రి ధరించాలి అంటున్నారు . అలాంటి వారిని చూసి జాలి పడతాను, నవ్వుకుంటాను . నేను చాలా మొండిదాన్ని . నాకు వచ్చిన ప్రతి పాత్ర  సమర్ధవంతంగా  నటించాలి విశ్వ ప్రయత్నం చేసేదాన్ని . మనసులో వున్నా భావం ముఖంలో  కనిపించేదాకా పట్టు వదిలేదాన్ని కాదు . అలాంటి కఠోర శ్రమ వల్లనే నేను ఏ పాత్రనైనా ధరించగలుగుతున్నా . “

ఇవి సావిత్రి ఇంటర్వ్యూ లోని కొంత భాగం మాత్రమే . సావిత్రి ఆటారువాత కొంత కాలానికే బెంగళూరు వెళ్లి కోమాలోకి వెళ్లారు . 19 నెలల పాటు మృత్యువుతో పోరాడి  26 డిసెంబర్ 1981లో భౌతికంగా మనకు దూరమయ్యారు . ఆమె నటించిన సినిమాలు వున్నత  వరకు చిరంజీవిగానే వుంటారు .

– భగీరథ

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...