fbpx
Home Opinions కెసియార్ కు ఆ మూడు వర్గాల నుంచే ముప్పు ఉందా?

కెసియార్ కు ఆ మూడు వర్గాల నుంచే ముప్పు ఉందా?

(శ్రవణ్ బాబు)

పెన్షన్లు – కరెంట్ అనే రెండు అంశాలే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రధాన అస్త్రాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి తీసుకొచ్చే ఓట్లను తలదన్నేలా మూడు వర్గాల ఓట్లు టీఆర్ఎస్ కు దెబ్బ కొడతాయా అనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది ఎన్నికల పండితుల మధ్య. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అనే ఈ మూడు వర్గాలు టీఆర్ఎస్ పేరు చెబితేనే భగ్గుమంటూ మండిపతూ ఉండటమే దీనికి కారణం.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది యువత, ఎన్జీవోలు, జేఏసీలు అన్న సంగతి అందరికీ విదితమే. వివిధ కారణాలవల్ల ఈ వర్గాలన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యాయి. ఈ కారణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

అధికారంలోకి రాగానే లక్షా పాతికవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నాలుగున్నర ఏళ్ళ తర్వాత చూస్తే పట్టుమని పాతికవేల ఉద్యోగాలుకూడా ఇవ్వలేదు. ఖాళీలయితే పుష్కలంగా ఉన్నాయి. దానికితోడు కేసీఆర్ ఆర్భాటంగా పది జిల్లాలను అమాంతం 31కు పెంచటంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలలో, విభాగాలలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్లయితే ఇచ్చారుగానీ వాటిలో అత్యధికశాతం భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి కారణం భర్తీ ప్రక్రియ నియమ నిబంధనలలో లోపాల వలనగానీ, విధివిధానాలలో తప్పులవలన గానీ కొందరు అభ్యర్థులు కోర్టులకు వెళ్ళటంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. దీనికి కారణం ప్రభుత్వ అసమర్థతే. సర్వీస్ కమిషన్ కు అనుభవజ్ఞులైన, సమర్థులైనవారిని నియమిస్తే పని సజావుగా సాగేది. ప్రభుత్వం ఛైర్మన్ పదవికి నామినేట్ చేసిన ప్రొఫెసర్ చక్రపాణి వ్యవహారశైలిపై అనేక విమర్శలు బలంగా వినబడ్డాయి. అయినాకూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవటంగానీ, సర్వీస్ కమిషన్ కు సమర్థులను నియమించటంగానీ చేయలేదు.

భర్తీ ప్రక్రియలకు కీలకంగా భావించే జోనల్ విధానాన్ని గులాబీ బాస్ నాలుగేళ్ళూ పట్టించుకోకుండా వదిలేయటంకూడా మరో ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ఎట్టకేలకు నిద్రలేచి ఈ ఏడాది జులైలో ఢిల్లీ వెళ్ళి ఆమోదముద్ర వేయించుకొచ్చారు.

మరోవైపు, కొత్త ప్రభుత్వం రాగానే ఉద్యోగ నియామకాలు త్వరత్వరగా జరుగుతాయని ఊహించుకుని పల్లె ప్రాంతాల నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు హైదరాబాద్ నగరంలో రూములు తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టారు. లైబ్రరీల్లో, రీడింగ్ రూముల్లో ఎక్కడ చూసినా ఉద్యోగార్థులైన అభ్యర్థులే. రు.5 ప్రభుత్వ భోజనం తిని, చెట్లకింద కూర్చుని కష్టపడి తాము ఒకపక్క ప్రిపేర్ అవుతుంటే, భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోవటంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. కేసీఆర్ పేరు చెబితేనే ఒంటికాలుమీద లేస్తున్నారు.

 

ఆర్టీసీ ఉద్యోగులుకూడా కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. గత వేసవికాలంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను కేసీఆర్ కఠినంగా అణచివేయటం, తమ డిమాండ్లను కనీసం పట్టించుకోకపోవటంతో వారుకూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ అమలు చేయాలన్నది వారి డిమాండ్. 2013నాటి పీఆర్సీ కాలపరిమితి 2017 మార్చి 31తో ముగిసి ఏప్రిల్ 1నుంచి కొత్త వేతనాలు అమలు కావాల్సి ఉన్నప్పటికీ, పదిహేను నెలలుగా ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటంలేదంటూ జూన్ 11నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీనిపై కేసీఆర్ కస్సుమన్నారు. సమ్మె విరమించకపోతే ఇదే ఆఖరి సమ్మె అవుతుందంటూ, ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానని పరోక్షంగా హెచ్చరించారు. ఇరువర్గాలూ తీవ్రస్థాయిలో పట్టుపట్టుకుని కూర్చోగా, హరీష్ రావు, కేటీఆర్ కలిసి పంచాయతీ చేసి ఆర్టీసీ ఉద్యోగులతో సమ్మె విరమించినట్లు ప్రకటింపజేశారు. కానీ ఉద్యోగులలో అధికశాతంమంది మాత్రం ఆ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఇప్పటికీ మర్చిపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 56 వేలు.

ఇదిలాఉంటే ఈ మూడువర్గాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని మరోవర్గంనుంచి కూడా కొంతమేర తెరాసకు వ్యతిరేకంగా ఓట్లుపడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షలమంది ఉన్న కౌలురైతులు దాదాపు 65శాతం వ్యవసాయభూమిని సాగుచేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో అత్యధికశాతం కౌలురైతులేనని గణాంకాలు చెబుతుంటాయి. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ఇచ్చే కేసీఆర్ రైతుబంధు పథకం వీరికి మొండి చెయ్యి చూపింది. మరోవైపు నలభై, యాభై ఎకరాలు ఉన్న బడా భూస్వాములకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయటం ఒక విచిత్రం.

ఇకపోతే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆంధ్రోళ్ళ కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానన్న కేసీఆర్ మళ్ళీ ఇటీవల జిల్లాలలో ఎన్నికల సభలలో వారిపై విరుచుకుపడటంకూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక వ్యతిరేకాంశంగానే చెప్పుకోవాలి. కూకట్ పల్లిలాంటి ప్రత్యేకమైన స్థానంలో సెటిలర్స్ లోని కొంతమంది టీడీపీతో ఉన్న వ్యతిరేకత కారణంగా టీఆర్ఎస్ కు వేసినా, మిగిలిన చోట్ల టీఆర్ఎస్ కు ఓటువేసే అవకాశాలు మృగ్యమనే చెప్పాలి. మరి ఈ ప్రతికూలాంశాలు టీఆర్ఎస్ విజయావకాశాలను ఏ మేర దెబ్బతీస్తాయనేది తెలియటానికి మరో వారం రోజులు ఆగాలి.

 

(రచయిత హైదరాబాద్ లో ఉండే సీనియర్ జర్నలిస్టు, ఫోన్  నెం  99482 93346)

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

ప్రభాస్ ఇస్తానంటున్న సర్పైజ్ ఇదే? (వీడియో)

మే 21న ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసారు. అంతేకాదు ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి...

ఐశ్వర్య ట్వీట్ దుమారం, క్షమాపణ చెప్పనంటూ హీరో

నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ ట్వీట్ ను డిలీట్‌ చేయాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర...

అడ్రస్ లేని పవన్…ఎగ్జిట్ పోల్స్ పై నోరెత్తటం లేదే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మొదటి నుండి కొంచెం తేడాగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినపుడు వెంటనే అందరూ మాట్లాడినా పవన్ మాత్రం ఎక్కడా కనిపించరు. అందరూ ఆ సమస్యను మరచిపోతున్న...

‘మహర్షి’:తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ !

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. రిలీజ్ పది రోజులు...

సంస్ధేదైనా అధికారం మాత్రం వైసిపిదే

ఎగ్జిగ్ పోల్ నిర్వహించిన సంస్ధల ఫలితాలతో హోరెత్తిపోతోంది. జాతీయ రాజకీయాలను పక్కనపెడితే రాష్ట్రం వరకూ వైసిపిదే అధికారం అని తేలిపోయింది. ఒక్క లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తప్ప ఇక ఏ...

సిస్టర్ సెంటిమెంట్ నమ్ముకుంటున్న బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి...

‘ఏబీసీడీ’కలెక్షన్స్ మరీ అంత దారుణమా?

అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్‌ చేసారు కానీ కలిసి...

పదేళ్ళుగా ఈవిఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారట !

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగానే ఉంటాయి. తాను చెప్పదలుచుకున్నదే చెబుతారు. అంతేకానీ అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. అలాగే చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన కూడా ఉండదు. తాజాగా ఢిల్లీలో ఎన్నికల...

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...
 Nate Gerry Jersey