fbpx
Home Cinema 'కబాలి' డైరక్టర్ అరెస్ట్ ఆపమంటూ కోర్టు

‘కబాలి’ డైరక్టర్ అరెస్ట్ ఆపమంటూ కోర్టు

రజనీకాంత్ తో కబాలి, కాలా చిత్రాలు తీసిన సినీ దర్శకుడు పా.రంజిత్‌. ఆ రెండు చిత్రాలతోనే అంతర్జాతీయం గా పేరు తెచ్చుకున్న ఆయన రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుని కోర్ట్ కు ఎక్కాల్సి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజరాజ చోళన్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపధ్యంలో పా.రంజిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కుంభకోణ ప్రాంత ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు పా.రంజిత్‌పై మతకలహాలను రేకెత్తించడం, శాంతి భద్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పా.రంజిత్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోరుతూ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్‌ దాఖలు చేశారు.

అందులో తాను చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, తన వ్యాఖ్యలను సోషల్ మీడియా వక్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ గురువారం న్యాయమూర్తి రాజమాణిక్యం సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్శకుడు పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని వాదించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి సమాజంలో మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉండగా ప్రజలు గొప్పగా భావించే రాజరాజచోళన్‌ గురించి ప్రస్థావించాల్సిన అవసరం ఏముందని దర్శకుడు పా.రంజిత్‌కు అక్షింతలు వేశారు. అదే విధంగా ఈ నెల 19 వరకూ దర్శకుడిని అరెస్ట్‌ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ కేసుకు సంబంధించి తిరుప్పనంద పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బదులు పిటిషన్‌ను 19వ తేదీన కోర్టులో దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు.

వివాదానికి కారణం అయిన వ్యాఖ్య

పా.రంజిత్‌ రీసెంట్ గా కుంభకోణం సమీపంలోని తిరుప్పనంద గ్రామంలో దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన మాట్లాడుతూ…

ʹచోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు. దేవదాసి అనే వ్యవస్థ రూపుదిద్దుకున్నది వీరి హయాంలోనే. అంతే కాకుండా 26 మంది ప్రజలు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు అమ్మివేయబడ్డారు. కాబట్టి కుల సమస్య ఈనాటిది కాదు. రాజారాజా చోళన్ పాలన దళితులకు చీకటి యుగంʹʹ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. రంజిత్ మాట్లాడిన ఈ విషయాలు ʹహిందూ మక్కల్ కచ్చిʹ అనే సంస్థకు చెందిన తంజావూరు జిల్లా మాజీ కార్యదర్శి బాల రంజిత్ పై కేసు పెట్టాడు. నటుడు కరుణాస్‌ వంటి వారు పా.రంజిత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా తిరుప్పనంద గ్రామంలో పా.రంజిత్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ మతసామరస్యానికి వ్యతిరేకం అని, తమిళ స్త్రీల మనోభావాలను కించపరచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

అవినీతి వద్దంటే ఎమ్మెల్యేల సంగతి ఏంటి జగనన్న?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఒక అంశం అవినీతి. జగన్ చెప్తున్న ప్రధాన అంశం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని అవినీతిని అన్ని స్థాయిలలో బయటకు...

రివ్యూ – టెంప్లెట్ డిటెక్టివ్ పాట్లు!

షార్ట్ ఫిలిమ్స్ నటుడు నవీన్ పొలిశెట్టి సినిమా హీరోగా మారి డిటెక్టివ్ సినిమా చేశాడు. కొత్త దర్శకుడు స్వరూప్ దీన్ని తెరకెక్కించాడు. ఈ ఆరు నెలకాలంలో 118, కిల్లర్, గేమ్ ఓవర్, విశ్వామిత్ర,...

‘మల్లేశం’ రివ్యూ – ఆలోచింపజేసే ఆర్టు!

తెలంగాణా సినిమా వాస్తవిక కథా చిత్రాలవైపే ఎక్కువ వుంటుంది. మొదటినుంచీ ఈ పంథానే అనుసరిస్తోంది. తెలంగాణా ప్రాంతం గురించి ఏదో చెప్పాలన్న తపన. దేశంలో ఇంకా 18 ప్రాంతీయ చలన చిత్ర రంగాలున్నాయి....

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘కబీర్ సింగ్‌’ నిషేధించాలని కోర్ట్ లో కేసు, కేంద్రానికి లేఖ

విజయ్‌ దేవరకొండ కెరీర్ లో ‘అర్జున్‌ రెడ్డి’ఓ సంచలనం . తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై...

గుర్రాన్ని మచ్చిక చేసుకుంటున్న ఎన్టీఆర్‌(వీడియో)

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాతగా రూపొందుతున్న చిత్రంలో...కొమర మ్‌ భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్‌ కనిపిస్తారు. 1920లలో...

సాయి తేజ ‘ప్రతిరోజు పండగే’ పాయింట్ ఇదే

రీసెంట్ గా మెగా హీరో సాయి తేజ్ కొత్త చిత్రం మొదలైన సంగతి తెలసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు....

చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసేస్తారా ?

తాను నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ నే క్యాంపు ఆఫీసుగా...

రాజేంద్ర ప్రసాద్ పై సమంత కోప్పడి, అరిచిందా?

నలుగురు మనుష్యులు కలిసి పనిచోట ఎప్పుడూ ఏదో ఒక మాట, వివాదం వస్తూనే ఉంటాయి.అయితే వాటిని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతూంటారు అనుభవజ్ఞులు. ముఖ్యంగా సీనియర్స్...తమ కన్నా చిన్న వాళ్ల కు నటన...

విద్యార్థులను పట్టించుకోండి : సినీనటి జ్యోతిక

  వివాహానంతరం సినీ పరిశ్రమకి దూరమైనా నటి జ్యోతిక, ఈ మధ్యనే తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రం "రాక్షసి". ఈ చిత్రం లో జ్యోతిక ప్రభుత్వ...

బాక్సైట్ తవ్వకాలపై జగన్ సంచలన నిర్ణయం

విశాఖపట్నం మన్యం ప్రాంతంలో తీవ్ర అలజడులకు కారణమవుతున్న బాక్సైట్ తవ్వకాలపై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల జీవనానికి అటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలను నిలిపేయాలని చెప్పారు. నిజానికి బాక్సైట్ తవ్వకాలను...

ప్రజావేదికను కూల్చేశారు..కరకట్ట దగ్గర ఉద్రిక్తత

కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చేసింది. భారి బందోబస్తుతో బుధవారం తెల్లవారాజామున వేదిక దగ్గరకు చేరుకున్న సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతను అడ్డుకునేందుకు తమ్ముళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చంద్రబాబునాయుడు ఎంతో...

బాలయ్యకే బాణం వేసాడు..తగులుతుందా?

షార్ట్ ఫిల్మ్స్ తో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్‌, వెండితెర మీద కూడా తొలి సినిమా అ!. తోనూ తనదైన ముద్ర వేశాడు. అ! సక్సెస్ సాధించిన ఇప్పుడు కల్కి చిత్రం డైరక్ట్...

న్యూస్ నిజమే అయితే నిజంగా షాకే

నిన్నటి నుంచీ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రిలీజ్ కు ముందు ఇలాంటి వార్తలు రొటీనే అయినా కాస్త ఇంట్రస్టింగ్ గానూ , అంతకు మించి ఆశ్చర్యంగానూ ఉంది. అదేమిటంటే...
 Nate Gerry Jersey