Home Telugu Movie Review ఫాదర్ సెంటిమెంటుతో యాక్షన్ డ్రామా: ‘విశ్వాసం’(మూవీ రివ్యూ)

ఫాదర్ సెంటిమెంటుతో యాక్షన్ డ్రామా: ‘విశ్వాసం’(మూవీ రివ్యూ)

 
ఫాదర్ సెంటిమెంటుతో యాక్షన్ డ్రామా!

Advertisement


“విశ్వాసం”
రచన – దర్శకత్వం : శివ 
తారాగణం : అజిత్, నయనతార, జగపతిబాబు, రోబో శంకర్, యోగిబాబు, మైమ్ గోపి, రవిప్రకాష్ తదితరులు 
సంగీతం : డి. ఇమాన్, ఛాయాగ్రహణం : వెట్రి
బ్యానర్ :
నిర్మాతలు :
విడుదల : మర్చి 1, 2019
3 / 5
***

          గత జనవరిలో రజనీకాంత్ ‘పేట’ ని తట్టుకుని రెండొందల కోట్లు వసూలు చేసిన అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ‘విశ్వాసం’  తెలుగు డబ్బింగ్ ఆలస్యంగా ఈ వారం విడుదలైంది. ఫాదర్ – చైల్డ్ సెంటిమెంటు ప్రధానంగా అన్ని రసాలూ మేళవించిన ఈ ఫ్యామిలీ డ్రామాని తమిళ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. వరసగా అజిత్ తో సినిమాలు తీస్తూ వస్తున్న దర్శకుడు శివ నాల్గో హిట్ గా ఇచ్చిన ఈ రొటీన్ కమర్షియల్ ఫార్ములా,  ఎందుకని ఇంత హిట్టయిందో  ఓసారి చూద్దాం…

కథ

          రావులపాలెంలో వీర్రాజు (అజిత్) రైస్ మిల్లు ఓనర్. వూళ్ళో కష్టాల్లో వున్న వాళ్లకి తోడ్పడుతూంటాడు. వూళ్ళో పదేళ్ళకో సారి జాతర జరుగుతుంది. జాతరప్పుడు ఎక్కడెక్కడి బంధువులూ వచ్చి కలుసుకుంటారు. ఈసారి జాతరకి బంధువుల్లేక వొంటరిగా వున్న వీర్రాజుని ఇప్పటికైనా వెళ్ళి భార్యనీ, కూతుర్నీ తీసుకురమ్మని బలవంతం చేస్తారు అమ్మలక్కలు. వీర్రాజు ముంబాయి వెళ్లి భార్య డాక్టర్ నిరంజన (నయనతార) ని కలుసుకుంటాడు. పదిహేనేళ్ళ కూతురు శ్వేత (అనీఖా) ని చూసి భావోద్వేగాలకి లోనవుతాడు. నిరంజన తనతో వచ్చే సమస్యే లేదంటుంది. అయితే కనీసం ఇక్కడే కూతురికి బాడీ గార్డుగానైనా వుండనివ్వమంటాడు. అతడికి బాడీ గార్డుగా జీతమిచ్చి  కూతురి భద్రత అప్పగిస్తుంది. తండ్రిగా మాత్రం చెప్పుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. 

          ఎందుకు వీర్రాజు కూతురికి బాడీగార్డుగా వుంటానన్నాడు? కూతురికి వచ్చిన ప్రమాదమేమిటి? అసలు పదేళ్ళ క్రితం భార్య ఎందుకు విడిపోయింది? ఇప్పుడు కూతురికి తండ్రిగా చెప్పుకోలేని పరిస్థితిని ఎలా భరించాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది?….ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

          కథలు అవే వుంటాయి. కాకపోతే 200 కోట్లు వసూలు చేయాలంటే వున్న ఫార్ములా కథనే ఇన్నోవేట్ చేసే తెలివితేటలుండాలి. గ్యాప్ తీసుకున్న సెంటిమెంట్లని ప్లే చేయాలి. ఫాదర్ –  చైల్డ్ సెంటిమెంట్ తో సినిమాలు రాక చాలా కాలమైంది. ఈ ఫార్ములాకి స్పోర్ట్స్ జోడిస్తే ఇన్నోవేట్ అయి 200 కోట్లు కురిపిస్తుంది. ఇన్నోవేట్  చేయడానికి ఎలాగూ కూతురితో అమీర్ ఖాన్ ‘దంగల్’ వుంది. కాకపోతే అమీర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చినట్టు గాక, ట్రైనింగ్ పొందుతున్న కూతురికి బాడీ గార్డుగా వుంటే ‘దంగల్’ ని కాపీ కొట్టినట్టు వుండదు. నేషనల్ జ్యూనియర్ 100 మీటర్ల రన్నింగ్ రేస్ టైటిల్ కోసం ఇంకొకడు ప్రమాదకరంగా అడ్డుపడుతున్నందుకే బాడీ గార్డు అవసరమున్న కథగా మారిపోతుంది. ఆ విలన్ కి కూడా తన కూతురు గెలవాలన్న పంతం. ఇంకేం, సరికొత్త విలనీ కూడా సెట్ అయింది. కూతురు వర్సెస్ కూతురు, తండ్రి వర్సెస్ తండ్రి. డబుల్ ధమాకాతో కలెక్షన్ల వర్షం.

ఎవరెలా చేశారు

          అజిత్ రెండు గెటప్స్ లో కన్పిస్తాడు. పదేళ్ళ క్రితం వూళ్ళో పెళ్లి కాని దసరాబుల్లోడుగా, పెళ్ళయాక పదేళ్ళకే ముంబాయిలో తానిష్ట పడే ప్యూర్ వైట్ మాన్ గా. 47 ఏళ్లకే జుట్టంతా తల్లబడిపోయిన అతణ్ణి చూసి కమెడియన్ వివేక్  అడుగుతాడు, “ డై కొట్టవా?” అని. నెరిసిన జుట్టు అజిత్ పాత్ర ముంబాయిలో కథే ఎక్కువ. సెంటిమెంట్లు, ఎమోషన్లూ ఈ పాత్రకే. ఆ వయసులో అతను చేసే ఫైట్స్ కి కుర్ర ఫైటర్లు గింగిరాలు తిరిగిపోతారు. మరీ మెలోడ్రామాకి పాల్పడకుండా, నేటి కమర్షియల్ సినిమా అనుమతించినంతవరకూ, కూతురితో బాండింగ్ ని ఓ పరిధిలోనే కళ్ళు చెమర్చేలా పాత్ర పోషణ చేసి నిలబెట్టుకున్నాడు. ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ తోడవడంతో, ఆ యాక్షన్ లోంచే కూతురి పట్ల త్యాగం, ప్రేమ, ఆప్యాయత వంటి సెంటిమెంట్లని తన నటనానుభవంతో పిండుకున్నాడు. ముగింపులో పిల్లలతో పేరెంట్స్ వుండాల్సిన తీరు గురించి కదిలించే డైలాగు చెప్తాడు.

          దూరమైన భార్య దగ్గరికి వచ్చే హీరోల సినిమాలుంటాయి. ఆమెని ప్రసన్నం చేసుకుని చేపట్టాలన్న యావతో వుండే కథలు. అజిత్ పాత్ర ఇలాటి చేష్టల జోలికిపోకుండా, కూతురిమీదే దృష్టి పెట్టి, భార్య అప్పగించిన బాధ్యత మాత్రమే నేరవేరుస్తూంటాడు. భార్యకి దగ్గరవ్వాలనో, కూతురికి తను  తండ్రని తెలియాలనో ఎక్కడా ప్రవర్తించడు. ఇందులోని బాధని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాడు. వూళ్ళో వున్నప్పుడు తను సంతోషంగా వుండే పాత్ర, ఆ సంతోషం వెనుక ఆనందం లేని జీవితం. దీన్నే ఇప్పుడూ ప్రేక్షకులు ఫీలయ్యేలా పాత్ర పోషణ చేస్తాడు. ఇందులో ఒకటే ఫిలాసఫీ వుంది, అప్పగించిన బాధ్యత మీద దృష్టి పెట్టి సవ్యంగా నిర్వర్తిస్తే, ఏమివ్వాలో అవన్నీ ఇచ్చేస్తుంది జీవితం. ఈ ఫిలాసఫీ అజిత్ పాత్రకి హుందాతనమివ్వడంతో,  రియల్ హీరో పాత్రగా కన్పిస్తాడు.

 
          నయనతార డాక్టర్ గా ఎక్కడో ముంబాయి నుంచి రావులపాలెం వచ్చి, మెడికల్ క్యాంపు పెట్టి, చదువురాని హీరోతో ప్రేమలో పడి, తనే పెళ్ళికి ఒప్పించుకునే ఏ కాలం నాటిదో పురాతన పాత్ర. కూతురు పుట్టాక హీరోతో తను విడిపోయే సీను తన పవర్ కి నిదర్శనం. ఏ పవర్ తో పెళ్లి చేసుకుందో ఆ పవర్ తో విడిపోయే హక్కు ఆమెకుంది. ఆ రెండు పవర్ఫుల్ ఘట్టాలకి మధ్య అతను వీక్ గా కన్పించడం అతడి తప్పుకాదు. అయినా తప్పదు. పదేళ్ళు తిరిగేసరికల్లా వేల కోట్లకి పడగలెత్తిన కార్పొరేట్ దిగ్గజంగా ఆమె అవతరించడం క్యారక్టర్ గ్రోతే. ఇలాటి క్యారెక్టర్ నటించడం ఆమెకి  కొట్టినపిండి. 

          కూతురి పాత్రలో మలయాళ బాలనటి అనీఖా బెస్ట్ ఛాయిస్. అన్ని సున్నిత భావోద్వేగాలూ ఆమె బాగా నటించగలదు. తనతో పోటీ పడుతున్న అమ్మాయితో పెద్దమనసుతో వుంటుంది. కానీ ఆ అమ్మాయి గెలవడం స్టెరాయిడ్స్  తీసుకుని గెలిచిందని తెలిశాక ఇక వూరుకోదు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలనుకుని ప్రాణాల మీదికే తెచ్చుకుంటుంది. ఈ ప్రాణాలు తీసే విలన్ పాత్రలో ఇంకో కార్పొరేట్ హంచో గా జగపతి బాబు కన్పిస్తాడు. తన కూతురి ఆత్మహత్యా యత్నానికి అజిత్ కూతురే కారణమని చంపి పారెయ్యడానికి ఇంటర్వెల్ దగ్గర్నుంచీ మొదలెడతాడు. అజిత్ కీ, జగపతి బాబుకీ రెండు సార్లు ముష్టి యుద్ధాలు భలే వుంటాయి. కూతురికోసం విలనీతో జగపతి బాబు మూస విలన్ పాత్రల  నుంచి బయటికొచ్చి, ఫ్రెష్ విలన్ గా బెటర్ గా కన్పిస్తాడు.

          ఇక ఇతర శాఖలు సంగీతం, కెమెరా స్టార్ సినిమాకి తగ్గట్టే వున్నాయి. ఇంటర్వెల్ ముందునుంచే లొకేషన్స్ ముంబాయికి మారిపోవడం దృశ్యాలకి రిచ్ నెస్ ని తీసుకు వచ్చింది. తమిళ వూర మాస్ ఫైటర్ల బాధతప్పి, ముంబాయి ఫైటర్లతో క్లాస్ గ వున్నాయి యాక్షన్ సీన్లు. అజిత్ గారు మాత్రం అదే తన బ్రాండ్ వైట్ లుంగీ చొక్కాలో ఫైటింగ్ విన్యాసాలు చేస్తూంటే, లుంగీ వూడదా అన్న వెర్రి సందేహాలు మనకొస్తూంటాయి. సల్మాన్ ఖాన్ అయితే లుంగీ చొక్కా వదిలించుకుని  విజృంభిస్తాడు.

చివరికేమిటి

          గోపీచంద్ తో ‘శౌర్యం’, ‘శంఖం’  అనే రెండు తెలుగు సినిమాలు తీసి దర్శకుడైన తమిళ ఛాయగ్రహకుడు శివ, అజిత్ బ్రాండ్ ని వరుసగా ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ అనే నాల్గు సినిమాలతో క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా ‘విశ్వాసం’ ని రొటీన్ ముఠా / ఫ్యాక్షన్ కక్షల బీభత్స వాతావరణానికి దూరంగా నీటైన ఫ్యామిలీ డ్రామాగా, కొత్త విలనీతో ఇద్దరు పిల్లల పాత్రల్ని ప్రధానంగా చేసి ఒక కొత్త రూపమిచ్చాడు. కుటుంబ ప్రేక్షకులకోసం ఫాదర్ – చైల్డ్ బాండింగ్ ని హైలైట్ చేస్తూ, యాక్షన్ ని ఆ చైల్డ్ సెంటిమెంట్ ని దెబ్బతీసే శక్తిగా చూపించాడు. ఇక్కడే సక్సెస్ అయ్యాడు.  రొటీన్ గా ఇంకేదో పాత కక్షలతో హీరో విలన్లు పోరాడుకునే టెంప్లెట్ ఫ్యామిలీ జానర్ కథగా వుంటే, ఇది రొటీన్ గానే ఫ్లాపయ్యేది.  

          ఇంకోటేమిటంటే, ఈ ఫ్యామిలీ డ్రామాని పస వుండని తెలుగు టైపు లోకల్ ఫస్టాఫ్ – సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో తీయలేదు. సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీశాడు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఇంటర్వెల్ లోపు కథ ప్రారంభమయ్యే విధానం తెలుగు దర్శకులు ఎందుకనో అంతగా ఇష్ట పడ్డం లేదు. కథని తగ్గిస్తూ ఇంటర్వెల్ వరకూ కామెడీలతో,  లవ్ ట్రాకులతో వూరికే కాలక్షేపం చేసి, ఇంటర్వెల్ నుంచి సెకండాఫ్ లో బొటాబొటీ అరగంట కథ చూపించి,  క్లయిమాక్స్ కెళ్ళిపోయే, ప్రేక్షకుల్ని మోసం చేసే, పద్ధతిని అవలంబిస్తూ ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ తీస్తూ ఆనందంగా వుంటున్నారు. 90 శాతం ఫ్లాపులు తీయంది ఆనందం వుండడం లేదు. 

          దీన్ని బ్రేక్ చేస్తూ నిజమైన స్క్రీన్ ప్లే చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ ప్రారంభంలో వూళ్ళో జాతర చూపించి, ఫ్లాష్ బ్యాకు ప్రారంభిస్తూ,  హీరో హీరోయిన్ల ప్రేమా పెళ్ళీ విడిపోవడాలూ వగైరా ఓ అరగంటలో ముగించేసి, హీరో ముంబాయి ప్రయాణంతో ఫస్టాఫ్ లోనే కథ ప్రారంభించేశాడు. ప్రారంభించాక, భార్యకి అదే పట్టుదల, కూతురికి ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి కాపాడేక బాడీగార్డుగా వుండేందుకు ఒప్పందం, మధ్యలో వీడెవడ్రా అని విలన్ ఎంట్రీతో ఇంటర్వెల్. 

          సెకండాఫ్ లో కూతుర్ని దొంగచాటుగా ఆమె కోరిన చోటికి తీసికెళ్ళి సరదాలు తీరుస్తూ భార్యతో చీవాట్లు, కూతురి ట్రైనింగ్, విలన్ కూతురితో కూతురి ట్రాక్, రేస్ వగైరా. స్టెరాయిడ్స్ తో రేసు గెల్చిన విలన్ కూతురు హీరో కూతురికి దొరికిపోయి ఆత్మ హత్యా యంత్నం, దీంతో ఉగ్ర రూపం దాల్చిన విలన్ హీరో కూతుర్ని ఫినిష్ చేసే ప్రయత్నంలో హీరో చావుబతుకుల మధ్య ఆస్పత్రి పాలవడం, ఇంకొక్క రోజే పోటీలకి టైం వుండడం, హీరో కూతుర్ని ఇక్కడ్నించి యూఎస్ కి తీసి కెళ్ళి పోతూ భార్య ప్రయాణం, హీరో ఎలాగో లేచి, కూతురికి రక్షణగా వుంటూ ఈవెంట్ ని గెలిపించుకోవడం, తన కోసం ఇంత చేస్తున్న ఈయనెవరని ఆఖరికి కూతురు తల్లిని నిలదీయడం, ఇక తల్లి చెప్పేయడం. 

          కూతురి భద్రతా, ఈవెంటూ ప్రమాదంలో పడిపోయి హీరో ప్రాణాపాయ స్థితికి పతనమవడం ప్లాట్ పాయింట్ టూ అయితే, ఫస్టాఫ్ లో వేరే ఘర్షణల మూలంగా కూతురికి దూరమవడం ప్లాట్ పాయింట్ వన్. ఇలా ఇవి  ఫస్టాఫ్, సెకండాఫ్ కథా బలాన్నీ సమాన ఎమోషన్స్ తో, గోల్స్ తో బ్యాలెన్స్ చేశాయి.

          సినిమా కథల్ని ఇలాటి సార్వజనీన స్క్రీన్ ప్లేలతో తీస్తే ప్రేక్షకులకీ బావుటుంది, సినిమాకీ బావుటుంది.

 

―సికిందర్

 

 

 

- Advertisement -

Related Posts

అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

పేరు: నిశ్శబ్దం విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020 నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే డైరెక్టర్: హేమంత్ మధుకర్ ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్ అనుష్క.. బాహుబలి సిరీస్...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

డబుల్ బ్యారెల్ మోరల్ ‘శకుంతలా దేవి’ రివ్యూ!

గణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్...

Run webseries review

Rating: 1.5/5 Cast: Navdeep, Poojitha Ponnada, Venkat,Amit Tiwari,Mukthar Khan, Kausalya,Manali Rathode,Shafi,Madhu Nandan,Bhanu Sri,Kireeti Damaraju and others Music: Naresh Kumaran Cinematography: Sajeesh Rajendran Director: Lakshmikanth Chenna Banner: First Frame...

Latest News

అయ్యబాబోయ్.. రాహుల్ సిప్లిగంజ్ షోలోనూ సేఫ్ గేమ్ ఆడిన లాస్య?

లాస్య మంజునాథ్.. బిగ్ బాస్ షో ముందు వరకు తను కేవలం ఒక యాంకర్ మాత్రమే. కానీ.. ప్రస్తుతం తను చాలా పాపులర్ అయింది. కన్నింగ్ స్మైల్, సేఫ్ గేమ్, పప్పు పేరుతో...

బిగ్ బాస్‌4: అభిజిత్‌పై కాజల్ విమర్శల వర్షం… పెయిడ్ మీడియాదే...

బిగ్ బాస్ షో తెలుగు షో సీజన్ 4 ఎండింగ్ కి వచ్చిన నేపథ్యంలో మంచి రసవత్తరంగా మారింది. ఇంట్లో పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. బయట కూడా జనాలు కంటెస్టెంట్ల వైజ్ చీలిపోయారు....

గ్రేటర్ ప్రజలకు బీజేపీ వరాలు.. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా కరోనా వాక్సిన్...

వారెవా... ఓవైపు కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయితే.. మన దగ్గర మాత్రం కరోనాను తమ రాజకీయ ప్రయోజనాల కోసం సూపర్ గా వాడుకున్నాయి రాజకీయ పార్టీలు. అంతే కదా మరి.. ప్రజలను బుట్టలో...

సోహెల్, అఖిల్ కు ఉచ్చపోయించారు? ఆ వీడియో బయటపెట్టొద్దంటూ బిగ్ బాస్...

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం దెయ్యాలు తిరుగుతున్నాయి. దెయ్యాలు.. ఇంట్లోని సభ్యులను ఏం చేయకుండా ఉండాలంటే అవి చెప్పిన పనులను బిగ్ బాస్ ఇంటిసభ్యులు చేయాల్సి ఉంటుంది. లేదంటే వాళ్లను ఏదైనా...

వైసీపీకి కూడా అదే ‘శాపం’ కాబోతోందట

'ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఆంధ్రప్రదేశ్‌ మాకు ప్రత్యేకమైన రాష్ట్రం..' అని గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది. టీడీపీ - బీజేపీ దోస్తానా గట్టిగా వున్న రోజులవి. కేంద్రంలో, రాష్ట్రంలో...

ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల బడ్జెట్ కంటే తీసుకునే రెమ్యూనరేషనే ఎక్కువట...

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ...

గ్రేటర్‌ పోరులో ఏపీ తెలుగు తమ్ముళ్ళెక్కడ.?

గత గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు టీడీపీ నేతలు హల్‌చల్‌ చేశారు ప్రచార పర్వం పరంగా. ఇప్పుడు అలాంటి జాతర ఎక్కడా కనిపించడంలేదు. తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో...

రాజకీయం కాదా.? రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా.?

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, ముందుగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేయాలి. రాజధాని అమరావతి విషయమై కేంద్రం నుంచి స్పష్టత కోరాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలపై నిలదీయాలి....

పవన్ సరసన నిధి అగర్వాల్ అంటే అందరికీ ఒకే గాని .....

క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో 27 వ సినిమా గా తెరకెక్కుతోంది....

ఇంతకూ పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్లినట్లు? 

"సింగన్న అద్దంకి వెళ్లనూ వెళ్ళాడూ  రానూ వచ్చాడూ" అని తెలుగు సామెత.  అంటే ఆ సింగన్న అద్దంకి అనే ఊరు ఎందుకు వెళ్ళాడో మళ్ళీ ఎందుకు వెనక్కు వచ్చాడో అతనికే తెలియదన్న మాట. ...

శ్రీముఖితో అలాంటి బంధం.. రాహుల్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోకు వెళ్లకముందు రాహుల్ శ్రీముఖి మంచి స్నేహితులు. కానీ బిగ్ బాస్ షో ఈ ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఈ ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో బద్ద శత్రువులుగా...

జగన్ కు మోడీ సర్కార్ గట్టి షాక్.. కళ్ళు బైర్లు కమ్మటమే...

 తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లు ఉంది బీజేపీ వ్యవహార శైలి, ఒక వైపు సీఎం జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే, మరో వైపు కొన్ని కీలకమైన బిల్లులను వెనక్కి పంపుతుంది...

బండి సంజయ్ ఇలాంటి పని చేస్తాడని ఎవరు ఊహించలేదు.. తెరాస ఎంఐఎం...

 గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి, ఎవరికీ ఎవరు తీసిపోని విధంగా విమర్శలు చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రధానంగా తెరాస బీజేపీ మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం నడుస్తుంది. బండి...

న‌ల‌బై ఏళ్ళ హీరో 80 ఏళ్ళ వ్య‌క్తిగా మారాడేంటి?.. కార‌ణం ఏమై...

ఇండ‌స్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌ని చేస్తుంటారు. మంచి పాత్ర దొరికితే దాని కోసం ఎంత రిస్క్ అయిన చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌రు. అలాంటి వారిలో...

హీరోయిన్ లైలాను పడేసేందుకు ప్రయాసలు.. డ్యాన్సర్ పండు వేషాలు వైరల్

బొమ్మ అదిరింది షోలో ప్రతీ వారం డ్యాన్సర్ పండు వేసే వేషాలు అందరికీ తెలిసిందే. నాగబాబును డ్యాడీ అంటూ పిలవడం, పెళ్లి చేయమని గోల చేయడం, వచ్చే ప్రతీ గెస్ట్‌ను ఓ పిల్లను...

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: శాశ్వ‌తంగా మూత‌ప‌డ‌నున్న థియేట‌ర్స్.. షాక్‌లో సినీ ప్రేక్ష‌కులు

ప్ర‌పంచాన్ని వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ఎంద‌రో జీవితాలు దుర్భ‌రంగా మారాయి. చాలా మంది త‌మ జీవ‌నాధారాల‌ను కోల్పోయారు. కొంద‌రు న‌టులు పూట గ‌డ‌వ‌డం కోసం రోడ్డెక్కి కూర‌గాయ‌లు అమ్ముకోవ‌డం లేదంటే టిఫ‌న్...

ఒంటి మీద నూలుపోగు లేకుండా.. జబర్దస్త్ బ్యూటీ ఎందుకిలా చేస్తోంది!!

జబర్దస్త్ వేదిక మీద ఈ మధ్య మెరిసిన బ్యూటీ వర్ష. ఎన్నో యేళ్లుగా సీరియళ్లు చేస్తున్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించే సరికి వచ్చింది. హైపర్ ఆది పరిచయం...

హైకోర్టు ఆదేశాలకు కళ్లెం వేసిన సుప్రీంకోర్టు

నిన్న గుజరాత్ లో ఒక అఖిలభారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్  సమావేశంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ముఖ్య ఉపన్యాసంలో కోర్టులు తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నాయి" అని న్యాయవ్యవస్థకు చురకలు వేస్తున్న సమయంలోనే...

బీజేపీ విషయంలో క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్.. దెబ్బకు గాలి తీసేశాడు..

 గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీలోకి వలసలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుండి విజయశాంతి, తెరాస నుండి స్వామి గౌడ్ లాంటి నేతల బీజేపీ గూటికి చేరుకుంటున్నారు, ఇదే సమయంలో సినీ పరిశ్రమకు...

బాయ్ ఫ్రెండ్‌తో బ్రూస్ లీ హీరోయిన్ డేటింగ్.. పెళ్లెప్పుడో క్లారిటీ ఇచ్చిన...

ఈ ఏడాది సెల‌బ్రిటీలు బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వార‌వుతున్నారు. హీరోలు నితిన్, రానా, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి సెల‌బ్రిటీలు ఏడ‌డుగులు వేయ‌గా, డిసెంబ‌ర్ 7న నిహారిక...

బీజేపీ నోటి దురుసు.. ఫలితాలను తారుమారు చేస్తాయా..?

 గ్రేటర్ ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతూ ఎన్నికల సమరంలో దూసుకొని వెళ్తుంది. అనుకోని విధంగా దుబ్బాకలో విజయం సాధించటంతో ఆ పార్టీకి ఎక్కడ ఉత్సహం, ఊపు...

అమ్మ బాబోయ్ అలా ప్లాన్ చేశాడా?.. హనీమూన్‌ కోసం నితిన్ స్కెచ్...

లాక్డౌన్ వల్ల హీరోల పెళ్లిళ్లు చాలా డల్‌గా జరిగాయి. లేదంటే టాలీవుడ్ మొత్తం దుమ్ములేచిపోయేది. హీరో నితిన్ అయితే ఏకంగా దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాడు. దాని కోసం ఆల్రెడీ ఐదు...

బిగ్‌బాస్ 4: దెయ్యంగా మారింది సీజన్ 1 కంటెస్టెంటా?.. సోష‌ల్ మీడియాలో...

ఫినాలే స‌మీపిస్తున్న కొద్ది హౌజ్‌లో ప‌రిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. బిగ్ బాస్ ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌లు ఇస్తూ కంటెస్టెంట్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. ఓ ఇద్దరు స‌భ్యులు మంచిగా ఉన్నారంటే వారిద్ద‌రి మ‌ధ్య ఎలా పుల్ల...

బిగ్ బాస్‌4: బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్.. గీతా మాధురి...

బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో ఓ దెయ్యం రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆ దెయ్యమే ఉండేలా కనిపిస్తోంది. నిన్నటి వచ్చిన దెయ్యం ఎవరై ఉంటుందా? అని...

బిగ్ బాస్ షోపై మెగా బ్ర‌ద‌ర్ స్పంద‌న‌.. ఆ ఇద్ద‌రికీ స‌పోర్ట్...

బుల్లితెర బిగ్ రియాలిటీ షో సెల‌బ్రిటీల దృష్టిని కూడా ఆక‌ర్షిస్తుంది. చాలా మంది ప్ర‌ముఖులు ఈ షోపై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ త‌మ‌కు ఫేవ‌రేట్ కంటెస్టెంట్స్ అయిన వారిని గెలిపించ‌మ‌ని సోష‌ల్ మీడియా ద్వారా...

పవన్ కోరిక తీరింది కానీ.. పార్టీ కోరిక మాత్రం తీరలేదు

 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులు ఢిల్లీ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకున్నాడు, నిజానికి అసలు ఎన్ని రోజులు పర్యటన ఉంటుందో కూడా ఆయనకే సరిగ్గా తెలియదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్...

చెలరేగిపోతున్న స్టార్ హీరోయిన్స్ మధ్య చిచ్చు పెట్టిందెవరు ..?

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతూ ఫుల్ ఫాం లో ఉన్నారు పూజా హెగ్డే.. రష్మికా మందన్నా. ఈ ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ ఉంది....

వైసీపీలోని రెడ్డి నాయకులు బీసీ నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారా!!

కులాల, మతాల ప్రస్తావన లేకుండా భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడటం సాధ్యం కాదు. సాధారణంగా రాజకీయ నాయకులు కులాలు, మతాల మధ్య ఘర్షణలు పెడుతూ వాళ్ళు మాత్రం పక్కన చోద్యం చూస్తూ ఉంటారు....

మల్లెపూల ఫోటోను షేర్ చేసిన కాజల్.. వ్యవహారం తేడాగా ఉందే!

కాజల్ అగర్వాల్ అసలే హనీమూన్ జోష్‌లో ఉంది. కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30ను వివాహాం చేసుకుంది. నవంబర్ మొదటి వారంలో హనీమూన్‌కు చెక్కేసింది. అలా హనీమూన్‌లో ఈ కొత్త...

దారుణంగా మోసపోయాను.. మ్యూజిక్ డైరెక్టర్ కోటి కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో ఓ విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా పదే పదే అవగాహనను కల్పిస్తుంటారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ల వలలో ఎంతో మంది అమాయకులు చిక్కుతున్నారు. కొంతమంది వేలు,...