రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

tollywood hero nani V cinema review

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో నానితో పాటుగా మరో కీలక పాత్రలో సుధీర్ బాబు నటించగా.. హీరోయిన్లుగా నివేథ థామస్, అదితి రావు హైదరీ నటించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మాత. ఓటీటీలో రిలీజ్ అయి ఈ సినిమా మరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? తెలుసుకుందాం పదండి..

tollywood hero nani V cinema review
tollywood hero nani V cinema review

కథ:

ఈ సినిమాలో కథ విషయానికి వస్తే.. ఇది పక్కా రివేంజ్ స్టోరీ. డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) యాక్షన్ సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ సిటీలో ఉన్న రౌడీలను ఏరిపారేసే డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్.   విష్ణు(నాని) ముందుగా ఓ పోలీసును చంపుతాడు. చంపడమే కాదు.. డీసీపీ ఆదిత్యకు చాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ట్రేస్ చేయలేని ఫోన్ల నుంచి ఆదిత్యకు ఫోన్లు చేస్తూ మర్డర్ చేస్తున్నాని చెబుతూ ఒక్కో మర్డర్ చేస్తూ పోతాడు. ఆ మర్డర్లను చేధించడానికి డీసీపీ ఆదిత్య ఎంతో కష్టపడుతుంటాడు. కిల్లర్ విష్ణు ముందు పోలీసును చంపాక.. మరో నలుగురిని చంపుతానని ఆదిత్యకు చెప్పి తనను పట్టుకోవాలంటాడు. మిగితా నాలుగు మర్డర్ల తర్వాత కూడా తనను పట్టుకోలేకపోతే.. నువ్వు సూపర్ కాప్ కాదు.. అని ఒప్పుకోవాలని కండీషన్ పెడతాడు. దీంతో ఆ మర్డర్ల మిస్టరీని ఛేదించే పనిలో ఆదిత్య ఉంటాడు. చివరి వరకు కథ ఇదే ఫ్లోలో నడుస్తూ ఉంటుంది.

అయితే విష్ణు కిల్లర్ గా ఎందుకు మారాడు? 5 హత్యలు ఎందుకు చేశాడు. డీసీసీ ఆదిత్యకే ఎందుకు చాలెంజ్ విసిరాడు? చివరకు కిల్లర్ ను డీసీపీ ఆదిత్య పట్టుకున్నాడా? లేదా? అనేదే మిగితా కథ.

tollywood hero nani V cinema review
tollywood hero nani V cinema review

ప్లస్ లు

ఈ సినిమాకు ప్లస్ లు అంటే క్లయిమాక్స్ లో నాని పర్ ఫార్మెన్స్

క్లయిమాక్స్ లో నాని సెంటిమెంట్

పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు

మైనస్ లు

ఈ సినిమాలో ఎక్కువగా మైనస్ లే ఉన్నాయి. ముఖ్యంగా విలన్ రోల్ లో నాని అస్సలు సెట్ అవ్వలేదు. ఆర్మీ ఎపిసోడ్స్ కూడా లాజిక్ కు అందకుండా ఉన్నాయి. నివేథా థామస్, ఆదితిరావ్ హైదరీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వాళ్లకు నటించే స్కోప్ లేదు. వాళ్ల ఎపిసోడ్స్ కూడా చప్పగా ఉన్నాయి.

tollywood hero nani V cinema review
tollywood hero nani V cinema review

విశ్లేషణ

ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండేవి కానీ.. ఆ అంచనాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా అంటేనే ఏదో కొత్తదనం ఉంటుంది. అందులోనూ నాని లాంటి పెద్ద స్టార్ తో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకుంటారు. కానీ.. ఆ ఊహలకు అందకుండా సినిమా మాత్రం చాలా చప్పగా ఉంది. ముఖ్యంగా విలన్ రోల్ లో నాని సూట్ కాలేదు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా సెట్ అయినా.. అంతగా ఆయనకు నటించే స్కోప్ కూడా లేదు ఈ సినిమాలో. ఇక.. పేరుకు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ.. సినిమాలో అంత సస్పెన్స్ ను ప్రేక్షకుడు ఫీల్ అయ్యే పరిస్థితి మాత్రం ఉండదు. మొత్తానికి ఈ సినిమాకు అన్నీ మైనస్ లే.

కంక్లూజన్

ఈ సినిమా డౌట్ లేకుండా ప్లాఫ్ సినిమా. థియేటర్ లో విడుదల కాలేదు కాబట్టి నిర్మాత బతికిపోయాడు అని చెప్పాలి. ఓటీటీకి అమ్ముకొని చాలామంచి పని చేశారు. లేకుంటే పెట్టిన డబ్బులు కూడా వచ్చి ఉండేవి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎలాగూ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఉంటుంది కాబట్టి… కరోనా టైంలో టైం పాస్ కావాలంటే సినిమాను చూసేయండి. సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడేవాళ్లు మాత్రం ఈ సినిమాను చూడకండి ప్లీజ్.

తెలుగు రాజ్యం రేటింగ్ : 2/5