బోల్డ్ అమల సంచలనం – ‘ఆమె’ ట్రైలర్

 

బోల్డ్ అమల సంచలనం – ‘ఆమె’ ట్రైలర్ 

అమలా పాల్ బోల్డ్ గా నటిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆమె ఇంకొద్ది రోజుల్లో తెర మీదికి వచ్చేస్తోంది. తమిళంలో ‘ఆడై” (డ్రెస్) ని తెలుగులో ‘ఆమె’ గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ క్రేజ్ సృష్టించింది… ట్రైలర్ లో అమలా పాత్ర ఫ్రీ బర్డ్ లా ఎంజాయ్ చేస్తోంది ఫ్రెండ్స్ తో. ఆమెకి బెట్స్ కట్టే హాబీ వుందని ముందే చెప్పారు… ఫ్రెండ్స్ తో బెట్ కడుతున్నట్టు, “పుట్టేటప్పుడు డ్రెస్ తో పుట్టానా?…సో మన డ్రెస్ మొత్తం విప్పేసి మన బాడీని యాక్చువల్ బర్త్ డే డ్రెస్…” అనే సగం డైలాగు ద్వారా ఉత్కంఠ రేపే పాయింటుతో ఊరించారు. మళ్ళీ అమల ఎంజాయ్ చేస్తున్న వివిధ మాంటేజేస్ మధ్య చిక్కుల్లో పడ్డట్టు ఇంటర్ కట్స్ వేశారు…బెట్స్, డ్రెస్, వీటితో ఒక మిస్ అడ్వెంచర్ అన్నట్టు అమల పాత్ర సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య వచ్చిన ట్రైలర్స్ లో క్యారక్టర్ ఆధారిత ట్రైలర్ గా ది బెస్ట్ ట్రైలర్ అనొచ్చు దీన్ని. ట్రైలర్ కిచ్చిన పాప్ ట్యూన్స్ హుషారుగా వున్నాయి. కెమెరా వర్క్, కలర్, లైటింగ్ థీమ్స్ ఉన్నతంగా వున్నాయి.

అయితే ట్రైలర్ కి తమిళంలో వ్యూస్ 43 లక్షలు వస్తే, తెలుగులో నాల్గు లక్షలే వచ్చాయి. పైగా ఇది ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరీ  జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’, చియాన్ విక్రమ్ నటించిన తమిళ డబ్బింగ్ ‘మిస్టర్ కేకే’ రెండు భారీ యాక్షన్ చిత్రాల మధ్య ఈ వారం విడుదలవుతోంది…

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దీని డబ్బింగ్ రైట్స్ కొని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కి ఇంకా స్ట్రాంగ్ రెస్పాన్స్ రావాల్సి వుంది- ఇదే సమయంలో విడుదలవుతున్న రెండు భారీ యాక్షన్ చిత్రాల దృష్ట్యా.

హీరోయిన్ ఓరియెంటెడ్ హార్రర్ థ్రిల్లర్ గా పేర్కొంటున్నారు దీన్ని. ఇందులో అమలా పాల్ కిడ్నాపవుతుంది. మొత్తానికి యూత్ తమ కల్చర్ తో పాల్పడే దుశ్చర్యల కాన్సెప్ట్ తో దీనికి యూత్ అప్పీల్ వున్నట్టే కన్పిస్తోంది. కొత్త దర్శకుడు రత్నకుమార్ దర్శకత్వం వహించాడు. వినయ్ కార్తీక్ కన్నన్ కెమెరా, ప్రదీప్ కుమార్, ఊక్రా బ్యాండ్ సంగీతం నిర్వహించారు. జులై 19 న విడుదల.

Aame - Telugu Official Trailer | Amala Paul | Rathnakumar | Pradeep Kumar, Oorka