Home Telugu Movie Review పానిండియా సీన్! - ‘సైరా’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

పానిండియా సీన్! – ‘సైరా’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

పానిండియా సీన్! – ‘సైరా’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

Advertisement

ఈ స్క్రీన్ ప్లే సంగతులు జాప్యానికి కారణం ‘సైరా’ పానిండియా స్పందనల వరకూ వేచి చూడాల్సి రావడం. ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో సినిమా కలెక్షన్స్ ని కూడా భాగం చేసి చెప్పుకోక తప్పడం లేదు. సినిమా కలెక్షన్స్ ట్రేడ్ పండితులు విశ్లేషించే సెక్షనే. కానీ స్క్రీన్ ప్లేలకి క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా ముందు చూడాలని చాలా స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుంటూనే వున్నాం. అయితే ఇప్పుడు పానిండియా మూవీ అనే కొత్త ‘జానర్’ తెలుగులో మొదలవడంతో ఇప్పుడు స్క్రీన్ ప్లేలకి మార్కెట్ యాస్పెక్ట్ ని కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం చేసేయకుండా, ఇతర భాషల మార్కెట్లకి సైతం విస్తరించి చూడాల్సి వచ్చేలా వుంది.

2015 లో ‘బాహుబలి’ 4 భాషల్లో విడుదలైనప్పుడు పానిండియా మూవీ పదం వాడకంలోకి రాలేదు. 2017 లో ‘బాహుబలి -2’ కి కూడా పానిండియా మూవీ పదం వాడలేదు. 2015 లో ‘కంచె’ నైతే దాని పానిండియా మార్కెట్ ని కూడా గుర్తించకుండా కేవలం తెలుగులోనే విడుదల చేశారు. ఇటీవల ‘సాహో’ తోనే పానిండియా మూవీ అన్నపదం పాపులరైంది. దీని తర్వాత ఇప్పుడు తెలుగు పానిండియాగా ‘సైరా’ ఐదు భాషల్లో విడుదలైంది. ‘సాహో’ వేరు, అది యాక్షన్ మూవీ. దాని పానిండియా మార్కెట్ కి నేటివిటీ సమస్య వుండదు. అది హిందీలో సేఫ్ అయింది. ‘సైరా’ లాంటి చారిత్రాత్మకం విషయం వేరు, దీనికి నేటివిటీ సమస్య వస్తుంది. దక్షిణాది చరిత్రలు పానిండియా మూవీస్ గా ఉత్తరాది ప్రేక్షకులకి కనెక్ట్ కాలేవని ‘సైరా’ చెబుతోంది. దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యాన్ని నార్తిండియా ఎప్పుడు గుర్తించింది గనుక. ఆ మాట కొస్తే ‘సైరా’ కి దక్షిణాదిలో కూడా తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కనెక్ట్ కాలేదని కలెక్షన్లు చెబుతున్నాయి.

అంటే దక్షిణాదిలో కూడా చారిత్రక సినిమాలకి ఏ రాష్ట్రానికా రాష్ట్రం వరకే పరిమితమయ్యే నేటివిటీ సంకెళ్ళు వుంటాయన్న మాట. ఒకప్పుడు శివాజీ గణేశన్ తో ‘వీర పాండ్య కట్ట బ్రహ్మన’ తెలుగులో డబ్ చేస్తే ఆడలేదు. శివాజీ గణేశన్ ఎంత గొంతు చించుకుని వీరత్వం ప్రదర్శించినా ఆడలేదు. దక్షిణాదిలో కూడా ఏ రాష్ట్రం వీరుడు ఆ రాష్ట్రంలోనే అరచుకోవాలన్న మాట. అయ్యప్ప, భక్త కన్నప్ప, భక్త సిరియాళ లాంటి దేవుళ్ళ సినిమాలతో దక్షిణాది రాష్ట్రాలలో నేటివిటీ సమస్య రాలేదు, రాబోదు కూడా. దైవ భక్తికి ప్రాంతాలతో పనిలేదు. స్థానిక వీరులకి ప్రాంతాలే పరిమితులు. పానిండియా కాలేరు. ‘సైరా’ కాలేదు. దీంతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్న రాజమౌళి స్క్రిప్టుని వెంటనే కొంత ‘నార్తీ కరిస్తున్నట్టు’ వార్తలు వచ్చాయి. అందులో అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం పాత్రలు ఢిల్లీలో కలుసుకున్నట్టు నార్తీ కరణ!

సౌతీకరణకే స్థానిక చరిత్రల మార్కెట్ లొంగడం లేదు. కొంత కథని నార్తిండియాకి బదలాయించినంత ఇతర భాషల్లో నేటివిటీ వచ్చేస్తుందా? ఒక్కో భాష నుంచి ఒక్కో పాపులర్ నటుడ్ని పెట్టుకున్నా స్థానిక వీరుడితో ‘సైరా’ పానిండియా నేటివిటీ కష్టమైనట్టు కన్పిస్తూనే వుంది. సైరా పానిండియా కనెక్ట్ అవడానికి ఒక ప్రయత్నం చేశారు : ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రని ఝాన్సీ లక్ష్మీ బాయి చెబుతున్నట్టు కల్పన చేసి, ఫ్లాష్ బ్యాకుగా చూపించారు. ఆమె రికమెండ్ చేస్తోంది కాబట్టి మనం చూడాలన్నట్టుగా పానిండియా ఆడియెన్స్ ని బుజ్జగించాలని చూశారు. ఇది వర్కౌట్ కాలేదు.

మూలంలో సార్వజనీనత లేనప్పుడు ఉపరితలంలో ముస్తాబులు ఊపిరి పోయవు. ఈ సమస్యకి పరిష్కారం ఇక లోకల్ చరిత్రలకి కొత్తగా పానిండియా జానర్ మర్యాదలేముంటాయో వాటిని కనుగొని, టేకప్ ఇండియా అంటూ దేశం మీదికి వదలడం. తెలుగు జానర్ మర్యాదలతో తీస్తే ఆలిండియా జానర్ మర్యాద అయిపోదు. కానీ ‘సైరా’ చరిత్రకి హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదలతో చూసినా లోపాలున్నాయి. పానిండియాగా విఫలమైతే, తెలుగు మార్కెట్ కైనా సేఫ్ అవడానికి దీనికి పెట్టిన భారీ బడ్జెట్ భారమంతా ఒక్క తెలుగు మార్కెట్ పైనే ఇప్పుడు పడుతోంది. ఇంత మెగా బడ్జెట్ ని తెలుగు మార్కెట్ ఒక్కటే లాగ గలదా? లాగలేదు. అయినా ప్రయత్నించాలంటే రిపీట్ ఆడియెన్స్ వుండాలి. ఇంత ప్రతిష్టాత్మక చలన చిత్ర రాజం తీసినప్పుడు ప్రేక్షకులకి మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా వుండాలిగా?

తెలుగు మార్కెట్ కైనా మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా లేకపోవడమే ప్రధాన సమస్య. యాక్షన్, ఎమోషన్ తప్ప, ఫీల్ అనే అమృతపానీయం జాలువారలేదు. దీన్నెలా అధిగమించ వచ్చు? పైన చెప్పుకున్నట్టు ఇంకా ఇప్పుడే చెప్పలేని పానిండియా జానర్ మర్యాదలు కాకపోయినా (టేకప్ ఇండియా), కనీసం హిస్టారికల్ జానర్ మర్యాదల్ని పాటించి అధిగమించవచ్చు. ‘సాహో’ లాంటి యాక్షన్ సినిమాలకి పానిండియా జానర్ మర్యాదలు చెప్పుకోవచ్చు. కానీ స్థానిక వీరుల చరిత్రల్ని పానిండియా చేయడానికి ఆ వీరులే అడ్డు. కనుక కొత్తగా వీటి పానిండియా జానర్ మర్యాదలు నిర్ణయించడం అంత సులభం కాదు. హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదల్ని ఆపాదించినా నేటివిటీ సమస్య తొలగదు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎవరికీ తెలీని, కాలగర్భంలో కలిసిన, పంజాబ్ కి చెందిన, హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్రతో ‘కేసరి’ లాంటివి తీసినా చూస్తారు. తెలుగు నుంచి ఎంత ప్రముఖ చరిత్ర తీసినా ఉత్తరాదికే కాదు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకీ పట్టదని ‘సైరా’ పానిండియా బాక్సాఫీసు రిపోర్టులు తేల్చి చెప్తున్నాయి. ఇప్పుడు రాబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ తప్ప, స్థానిక చరిత్రతో ఇంకే పానిండియా మూవీస్ రాకపోవచ్చు కూడా. కనుక, వీటి జానర్ మర్యాదల (టేకప్ ఇండియా) చర్చ ఇప్పుడవసరం లేదు.
తెలుగు మార్కెట్ కే హిస్టారికల్ జానర్ మర్యాదల ప్రకారం ‘సైరా’ చూసినప్పుడు పెద్ద పెద్ద కందకాలు కన్పిస్తున్నాయి.

రివ్యూ రాయడానికి ఈ సినిమా చూస్తున్నప్పుడే ఒక ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’, ఇంకో ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ రేంజికి ఫీల్ తో తీసికెళ్ళాలి కదా అన్పించక మానలేదు. ఎందుకు రోటీన్ తెలుగు మూస యాక్షన్ – ఎమోషన్ చట్రంలో పెట్టి తీసేశారు? పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్టుని, ఈ తరం వారికి చెబుతున్న కథలా మార్చుకుని తీశానని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పినప్పుడు, యాక్షన్ జానరేనా ఈ చరిత్రకి ఈ తరం కనెక్టయ్యే మార్గం? వీరుల చారిత్రలు తీయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ఏళ్లకేళ్ళు పరిశోధనలు మాత్రమే చేస్తే చాలదు, ఆ చరిత్రల్ని దృశ్యాత్మకంగా ఏవిజన్లో పెట్టి తీయాలన్న దానిపై కూడా బోలెడు చారిత్రక సినిమాల రీసెర్చి జరగాలి. మనకి తోచిన, మనకి తెలిసిన చట్రంలో పెట్టి తీసేస్తే కాదు. ఓపెనింగ్స్ వుంటాయి, రిపీట్ ఆడియెన్స్ వుండరు.

( next : స్క్రీన్ ప్లే విశ్లేషణ )
―సికిందర్

- Advertisement -

Related Posts

అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

పేరు: నిశ్శబ్దం విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020 నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే డైరెక్టర్: హేమంత్ మధుకర్ ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్ అనుష్క.. బాహుబలి సిరీస్...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

డబుల్ బ్యారెల్ మోరల్ ‘శకుంతలా దేవి’ రివ్యూ!

గణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్...

Run webseries review

Rating: 1.5/5 Cast: Navdeep, Poojitha Ponnada, Venkat,Amit Tiwari,Mukthar Khan, Kausalya,Manali Rathode,Shafi,Madhu Nandan,Bhanu Sri,Kireeti Damaraju and others Music: Naresh Kumaran Cinematography: Sajeesh Rajendran Director: Lakshmikanth Chenna Banner: First Frame...

Latest News

ఎన్నికలను అడ్డు పెట్టుకొని కుట్రలు చేసే సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో...

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ...

బ్రేకింగ్: అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా కన్నుమూత

అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా ఇకలేరు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన వయసు 60 ఏళ్లు. అర్జెంటీనాలో ఫుట్ బాల్ అంటే ఎంత క్రేజో.. డిగో మారడోనాకు...

ఆస్కార్ 2021కి భారత్ నుండి అధికారిక ఎంట్రీగా మలయాళ చిత్రం...

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికైంది . బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది....

తెలంగాణ ప్రభుత్వానికి అక్బరుద్దీన్ సవాల్? దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించండి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ... హైదరాబాద్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే... హైదరాబాద్ లో ముఖ్యంగా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఎంఐఎం...

ఆంధ్ర ప్రదేశ్ లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహాలో సీఎం జగన్ వినూత్న పథకానికి రూపకల్పన చేశారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమం...

ఆ వయసులోనే అలాంటి లెటర్.. నిహారికపై నాగబాబు కామెంట్స్

నాగబాబు యూట్యూబ్‌లో మన చానెల్ మన ఇష్టం పేరిట నిత్యం ఏదో టాపిక్ మీద మాట్లాడుతుంటాడు. తాజాగా రెండ్రోజుల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరిలేషన్‌కు కమ్యూనికేషన్స్ ముఖ్యమని...

ప్లేటు ఫిరాయించిన రాహుల్ సిప్లిగంజ్.. అనూహ్యంగా ఆమెకు మద్దతు

రాహుల్ సిప్లిగంజ్..ఎప్పుడూ ఇతడి పేరు వార్తల్లో నానుతూనే ఉంటుంది. డ్రంక్ డ్రైవ్ లో దొరికి ఒకసారి, పబ్ లో గొడవతో మరోసారి, బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి మరోసారి రెండు తెలుగు...

అలాంటి వార్తలు రావడమేంటి.. రకుల్‌కు ఇదేం కర్మరా బాబు!!

రకుల్ ప్రీత్‌పై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రకుల్ అది చేస్తోంది.. ఇది చేస్తోంది.. అక్కడి వెళ్లింది.. ఇక్కడకు వచ్చింది.. సినిమాల్లేవు.. ఖాళీగా ఉంటోంది.. రకుల్ సినిమాలను రిజెక్ట్ చేస్తోంది.....

Bigg boss 4: ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో...

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ముందు అభిజీత్ పేరే వినొస్తుంది. అభిజీత్.. ఏం మాట్లాడినా ఓ క్లారిటీ ఉంటుంది. ఏ టాస్క్ వచ్చినా మైండ్ తో...

రుద్రాక్ష ధరించడానికి నియమాలు ఇవే !

రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. వీటివల్ల అనేక రకాల ప్రయోజనాలు. అయితే వీటిని ధరించడానికి అనేక నియమాలు.. తెలుసుకుందాం.. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన...

కార్పొరేటర్ గా గెలిచి మతాల మధ్య చిచ్చుపెడుతున్న బండి సంజయ్.. ఉత్తమ్...

ప్రస్తుతం ఎక్కడ చూసినా చలితో అంతా గజగజ వణుకుతున్నారు. కానీ.. హైదరాబాద్ లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. వాతావరణం అక్కడ ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావుడే....

జనసేనాని ఢిల్లీ టూర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళడం ముమ్మాటికీ రాంగ్‌ టైమింగ్‌.. అని జనసైనికులే ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ బీజేపీ, చాలా తెలివిగా పావులు కదిపింది...

హైద్రాబాద్‌లో డిసెంబర్‌ 4 తర్వాత ఏం జరగబోతోంది.!

రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడం, ఓ నాయకుడి మీద మరో నాయకుడు విరుచుకుపడటం అనేది ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. అయితే, అవిప్పుడు హద్దులు దాటుతున్నాయి....

బిగ్ బాస్ 4: దెయ్యాన్ని ఏదో చేస్తాడట, కామెడీతో రెచ్చిపోయిన అవినాష్

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎండింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. కాగా ఆటను మరింత రసవత్తరంగా మలిచేందుకు బిగ్ బాస్...

మంచు ఫ్యామిలీలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ …ఎన్ని సినిమాలో చూడండి...

ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించకుండా బిజీ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చినందుకు ఇక రకుల్ పనైపోయిందని అందరూ భావించారు. కాని అలా భావించన...

బాబోయ్ రానున్న రోజుల‌లో ర‌కుల్ చాలా బిజీ.. చాంతాడంత లిస్ట్ విడుద‌ల...

పంజాబీ సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుకే అదృష్టం ప‌రిగెడుతుందా అనిపిస్తుంది. తెలుగు ,త‌మిళం, హిందీ భాష‌ల‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మ‌డు చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఒక్క‌టి కూడా అందుకోలేదు....

సీక్రెట్ రివీల్ : పూజా హెగ్డే అందుకే ఇక టాలీవుడ్ సినిమాలకి...

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందా ... తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఒకసారి పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద...

హీరోయిన్‌ని ఫాల్తుదానివి అంటూ తిట్టిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇక్క‌డ పెద్దగా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. అక్క‌డ తాప్సీ ప‌ట్టుకున్న‌దంతా బంగారం అయింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఈ...

న్యాయాన్ని నిలబెట్టిన అత్యున్నత న్యాయస్థానం 

న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని హతమారుస్తూ మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ పై స్టే ఇస్తూ సుప్రీమ్ కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతి పెద్ద...

తిరుపతి టికెట్ జనసేన కోరడం వెనుక పెద్ద వ్యూహ్యం!?

 తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇందులో భాగంగా ఢీల్లి స్థాయిలో మంతనాలు సాగిస్తున్నాడు. 2019 లో పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూసిన పవన్...

Bigg boss 4: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్? ఈసారి...

అబ్బ.. ఇది కదా ఆట అంటే. మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఆట చాలా టైట్ అయిపోయింది. ప్రతి నిమిషం ఉత్కంఠగా మారుతోంది. కంటెస్టెంట్లు కూడా ఇప్పుడు ఆచితూచి ఆడాల్సి...

ప్రేమ‌లో ప‌డ్డ ఆమీర్ ఖాన్ కూతురు.. ఎవ‌రితో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ ఈ మ‌ధ్య వార్త‌ల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొన్న లైంగిక...

రావడం రావడమే టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు సంధించిన స్మృతి ఇరానీ?

స్మృతి ఇరానీ.. మంచి వాగ్దాటి. బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. అందుకే ఆమె బీజేపీ హయాంలో కేంద్రమంత్రగా కొనసాగుతూ వస్తున్నారు. బీజేపీ మొదటి హయాంలోనూ ఆమె కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయితే.. ఎక్కడో...

రుద్రాక్ష విశేషాలు ఇవే !

రుదాక్ష.. హిందుమతంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో ఒకటి. శివుడి నుంచి ఏర్పడిని వీటిని శక్తివంతమైనవిగా వీటిని భావిస్తారు. వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. వీటిలో ఒక ముఖం నుంచి...

లాస్య‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన భ‌ర్త‌.. జున్నుని చూసి త‌న్మ‌య‌త్వం చెందిన వంట‌ల‌క్క‌

ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన లాస్య పెళ్ళి త‌ర్వాత కాస్త స్లో అయింది. పున్వ‌ర్వైభ‌వం అందుకునేందు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. 11వారాల పాటు స‌క్సెస్‌ఫుల్‌గా త‌న జ‌ర్నీని కొన‌సాగించిన లాస్య అనుకోకుండా హౌజ్‌ని...

సొంత జిల్లాలోనూ చేతులెత్తేసిన చంద్రబాబు.!

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌, కరోనా కారణంగా మృత్యువాతపడ్డంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా ఈ ఉప ఎన్నికకు...