Home Telugu Movie Review తెలుగులో టచ్ చేయని సినిమాలు

తెలుగులో టచ్ చేయని సినిమాలు

తెలుగులో టచ్ చేయని సినిమాలు

Advertisement

కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్…హాలీవుడ్ లో విజయవంతమైన టీనేజీ జానర్. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వయస్సుకు రావడం., వయసొచ్చిన లేలేత టీనేజీ దశ. హై స్కూలైపోయి కాలేజీలో అడుగుపెట్టే బాధ్యతల వల. కుటుంబ సౌఖ్యంలోంచి సంక్లిష్ట ప్రపంచ ప్రాంగణంలోకి…బాధ్యతల బరిలోకి. వ్యక్తిగా పరిణతి చెందే అనుభవాల్లోకి. బాల్యపు దృక్కోణం చెదిరి ప్రాపంచిక దృక్పథంలోకి. పదేళ్ళ బాల్యం నుంచీ పంతొమ్మిదేళ్ళ టీనేజీ వరకూ కథలు చెప్పే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ని హాలీవుడ్ కమర్షియలైజ్ చేసింది.

తెలుగులో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో దాసరి నారాయణ రావు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘నీడ’ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ. అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ జిజ్ఞాసని, కుతూహలాన్నీ చంపేస్తూ ప్రేమించడం, ప్రేమలో పడ్డంగా చూపడం ఎదుగుదలని ఆపేసే అపరిపక్వత. చిత్రం, టెన్త్ క్లాస్ లాంటివి అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్నికనే ఇలాటి సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి. ఇవి కమర్షియల్ కోణాన్ని మాత్రమే చూస్తాయి. హాలీవుడ్ నుంచి కూడా ఇలాటి సినిమాలొచ్చినా, ఎక్కువ సినిమాలు ఎదుగుదల గురించే వుంటాయి. మనం ఇప్పుడున్న తీరులో వున్నామంటే ఎలా పరిణామం చెంది ఇలా తయారయ్యామో చెప్తాయి ఈ రకం సినిమాలు. మానసిక పునాదిని వయస్సొచ్చాక అయిన అనుభవాలే వేస్తాయి.

కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది : అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు.
ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.

తెలుగు రూటు
కానీ తెలుగులో దీనికి భిన్నంగా, హైస్కూలు – ఇంటర్ పిల్లల ప్రేమలే వర్కౌటవుతాయని అవే కాలక్షేపంగా తీయడం. తాజాగా మలయాళంలో హిట్టయిన ఇలాటి దొకటి ‘తన్నీర్ మథన్ దినంగళ్’ (పుచ్చకాయల రోజులు) తెలుగు రీమేక్ హక్కులు కొనే పోటీ కూడా మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో రెగ్యులర్ గా వస్తున్న రోమాంటిక్ కామెడీలకి గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లేక, నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సే వరసగా చూస్తున్న మార్పు కన్పిస్తోంది. ఇప్పుడీ రీమేక్ తలపెడితే రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టం. పైగా అది మలయాళ కొత్త దర్శకుడు తన పర్సనల్ డైరీలాగా ఫీలై తీశాడు. ఎవరివో పర్సనల్ డైరీలూ, ముచ్చటైన ఫోటో ఫ్రేమ్ కథలూ, పోయెట్రీలూ రీమేక్ చేసేకంటే, అలాటివి స్వయంగా ఫీలై క్రియేట్ చేసుకోలేరా అన్నది ప్రశ్న.

హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు : ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు. ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు…

ఇదో పెద్ద పరిశ్రమ
టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35 తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.

తెలుగులో ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ (16 -19 ఏజి గ్రూపు) సినిమాల సెగ్మెంట్ ఖాళీగా పడివుంటోంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇంతవరకు లేని కొత్త ట్రెండ్ ని సృష్టించే ఆలోచన చేయడం లేదు. ఎంత సేపూ ఇరవై పైబడిన హీరోహీరోయిన్లతో అవే ముదురు రోమాంటిక్ కామెడీలు. థ్రిల్లర్ తీసినా గడ్డాలు పెంచుకున్న హీరోల హీరోయిజాలే. హాలీవుడ్ లో ‘బ్లడ్ సింపుల్’ తీసిన కోయెన్ బ్రదర్స్ ఇంకో ప్రయోగం చేశారు. నియో నోయర్ జానర్లో ‘బ్రిక్’ అనే నూనూగు మీసాల టీనేజీ జ్యూనియర్ కాలేజీ మర్డర్ మిస్టరీ తీసి సంచలనం సృష్టించారు. ‘బ్లడ్ సింపుల్’ లాగే ఇది కూడా యూనివర్సిటీల్లో కోర్సుగా నమోదైంది. నియో నోయర్ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ!

మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.

ప్రేమల్ని కామెడీల్ని కాసేపు పక్కనబెడదాం. ఎదుగుదల గురించిన కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ‘హోం ఎలోన్’ వుంది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ వుంది. మొన్న వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘అలీటా’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే అంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లో ఫ్లాష్ బ్యాక్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ ప్రమాణాలతో వుంటుంది. హిందీలో వచ్చిన ‘కయీ పోచే’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. ఇండియన్ కథతో డానీ బాయల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఇంకొకటి.

చుట్టూ వయోలెంట్ లోకం
ఈ నేపథ్యంలో ఎదుగుదల లేని, యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అనే ఏ వెరైటీలేని, మరో ఉత్త హైస్కూలు ప్రేమల మలయాళ ‘తన్నీర్ మథన్ దినంగళ్’ ని రీమేక్ చేయడం ఎంత వరకు అవసరమో వాళ్ళకే వదిలేద్దాం. కానీ తాము ఎలాటి ప్రపంచంలో వున్నారో టీనేజర్లకి తెలుసు. తియ్యటి అమాయక ప్రేమ సినిమాలు వాళ్ళనింకా మభ్య పెట్టలేవు. ప్రపంచం అతి సంక్లిష్టంగా, కన్ఫ్యూజింగ్ గా వుంది. పరమ వయోలెంట్ గా వుంది. ఇంకా చెప్పాలంటే అరచేతిలో విజువల్స్ కి దిగి వయోలెంట్ గా వుంది. వీడియో గేమ్స్ దగ్గర్నుంచీ సెల్ఫీల వరకూ. టిక్ టాక్ ల వరకూ. పబ్ జీ ల వరకూ. పోర్న్ వరకూ. టీనేజర్ల గ్యాంగ్ రేపుల వరకూ. పిల్లల కిడ్నాపుల వరకూ. తమతో ఆడుకునే పిల్లల రేపుల వరకూ. మార్కుల రేసుల వరకూ. కారు రేసుల వరకూ. బైక్ చోరీల వరకూ. చైన్ స్నాచింగుల వరకూ. బెట్టింగుల వరకూ. మాదక ద్రవ్యాల వరకూ. సోషల్ మీడియాల్లో వయోలెంట్ కామెంట్స్ వరకూ. వయోలెంట్ కానిదేదీ లేదు. ఒక విషయంపై ఎవ్వడూ వినడం లేదు. మాట్లాడ్డం లేదు. సమాచార మివ్వడం లేదు. అరుస్తున్నాడు. తిడుతున్నాడు. ఎవర్ని అడగాలి? ఎవర్ని అడిగి మార్గం నిర్దేశించుకోవాలి? ఈ ముళ్ళ చక్రం అనే ప్రపంచంలో ఇరుక్కోకుండా ఎలా వుండాలి? ఇరుక్కుంటే ఎలా బయట పడాలి?

రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు.

చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. ప్రజా సేవ కాదు, సొమ్ములొచ్చేవే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ!

―సికిందర్

- Advertisement -

Related Posts

అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

పేరు: నిశ్శబ్దం విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020 నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే డైరెక్టర్: హేమంత్ మధుకర్ ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్ అనుష్క.. బాహుబలి సిరీస్...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

డబుల్ బ్యారెల్ మోరల్ ‘శకుంతలా దేవి’ రివ్యూ!

గణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్...

Run webseries review

Rating: 1.5/5 Cast: Navdeep, Poojitha Ponnada, Venkat,Amit Tiwari,Mukthar Khan, Kausalya,Manali Rathode,Shafi,Madhu Nandan,Bhanu Sri,Kireeti Damaraju and others Music: Naresh Kumaran Cinematography: Sajeesh Rajendran Director: Lakshmikanth Chenna Banner: First Frame...

Latest News

ఎన్నికలను అడ్డు పెట్టుకొని కుట్రలు చేసే సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో...

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ...

బ్రేకింగ్: అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా కన్నుమూత

అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా ఇకలేరు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన వయసు 60 ఏళ్లు. అర్జెంటీనాలో ఫుట్ బాల్ అంటే ఎంత క్రేజో.. డిగో మారడోనాకు...

ఆస్కార్ 2021కి భారత్ నుండి అధికారిక ఎంట్రీగా మలయాళ చిత్రం...

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికైంది . బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది....

తెలంగాణ ప్రభుత్వానికి అక్బరుద్దీన్ సవాల్? దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించండి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ... హైదరాబాద్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే... హైదరాబాద్ లో ముఖ్యంగా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఎంఐఎం...

ఆంధ్ర ప్రదేశ్ లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహాలో సీఎం జగన్ వినూత్న పథకానికి రూపకల్పన చేశారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమం...

ఆ వయసులోనే అలాంటి లెటర్.. నిహారికపై నాగబాబు కామెంట్స్

నాగబాబు యూట్యూబ్‌లో మన చానెల్ మన ఇష్టం పేరిట నిత్యం ఏదో టాపిక్ మీద మాట్లాడుతుంటాడు. తాజాగా రెండ్రోజుల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరిలేషన్‌కు కమ్యూనికేషన్స్ ముఖ్యమని...

ప్లేటు ఫిరాయించిన రాహుల్ సిప్లిగంజ్.. అనూహ్యంగా ఆమెకు మద్దతు

రాహుల్ సిప్లిగంజ్..ఎప్పుడూ ఇతడి పేరు వార్తల్లో నానుతూనే ఉంటుంది. డ్రంక్ డ్రైవ్ లో దొరికి ఒకసారి, పబ్ లో గొడవతో మరోసారి, బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి మరోసారి రెండు తెలుగు...

అలాంటి వార్తలు రావడమేంటి.. రకుల్‌కు ఇదేం కర్మరా బాబు!!

రకుల్ ప్రీత్‌పై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రకుల్ అది చేస్తోంది.. ఇది చేస్తోంది.. అక్కడి వెళ్లింది.. ఇక్కడకు వచ్చింది.. సినిమాల్లేవు.. ఖాళీగా ఉంటోంది.. రకుల్ సినిమాలను రిజెక్ట్ చేస్తోంది.....

Bigg boss 4: ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో...

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ముందు అభిజీత్ పేరే వినొస్తుంది. అభిజీత్.. ఏం మాట్లాడినా ఓ క్లారిటీ ఉంటుంది. ఏ టాస్క్ వచ్చినా మైండ్ తో...

రుద్రాక్ష ధరించడానికి నియమాలు ఇవే !

రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. వీటివల్ల అనేక రకాల ప్రయోజనాలు. అయితే వీటిని ధరించడానికి అనేక నియమాలు.. తెలుసుకుందాం.. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన...

కార్పొరేటర్ గా గెలిచి మతాల మధ్య చిచ్చుపెడుతున్న బండి సంజయ్.. ఉత్తమ్...

ప్రస్తుతం ఎక్కడ చూసినా చలితో అంతా గజగజ వణుకుతున్నారు. కానీ.. హైదరాబాద్ లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. వాతావరణం అక్కడ ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావుడే....

జనసేనాని ఢిల్లీ టూర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళడం ముమ్మాటికీ రాంగ్‌ టైమింగ్‌.. అని జనసైనికులే ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ బీజేపీ, చాలా తెలివిగా పావులు కదిపింది...

హైద్రాబాద్‌లో డిసెంబర్‌ 4 తర్వాత ఏం జరగబోతోంది.!

రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడం, ఓ నాయకుడి మీద మరో నాయకుడు విరుచుకుపడటం అనేది ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. అయితే, అవిప్పుడు హద్దులు దాటుతున్నాయి....

బిగ్ బాస్ 4: దెయ్యాన్ని ఏదో చేస్తాడట, కామెడీతో రెచ్చిపోయిన అవినాష్

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎండింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. కాగా ఆటను మరింత రసవత్తరంగా మలిచేందుకు బిగ్ బాస్...

మంచు ఫ్యామిలీలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ …ఎన్ని సినిమాలో చూడండి...

ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించకుండా బిజీ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చినందుకు ఇక రకుల్ పనైపోయిందని అందరూ భావించారు. కాని అలా భావించన...

బాబోయ్ రానున్న రోజుల‌లో ర‌కుల్ చాలా బిజీ.. చాంతాడంత లిస్ట్ విడుద‌ల...

పంజాబీ సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుకే అదృష్టం ప‌రిగెడుతుందా అనిపిస్తుంది. తెలుగు ,త‌మిళం, హిందీ భాష‌ల‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మ‌డు చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఒక్క‌టి కూడా అందుకోలేదు....

సీక్రెట్ రివీల్ : పూజా హెగ్డే అందుకే ఇక టాలీవుడ్ సినిమాలకి...

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందా ... తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఒకసారి పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద...

హీరోయిన్‌ని ఫాల్తుదానివి అంటూ తిట్టిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇక్క‌డ పెద్దగా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. అక్క‌డ తాప్సీ ప‌ట్టుకున్న‌దంతా బంగారం అయింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఈ...

న్యాయాన్ని నిలబెట్టిన అత్యున్నత న్యాయస్థానం 

న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని హతమారుస్తూ మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ పై స్టే ఇస్తూ సుప్రీమ్ కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతి పెద్ద...

తిరుపతి టికెట్ జనసేన కోరడం వెనుక పెద్ద వ్యూహ్యం!?

 తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇందులో భాగంగా ఢీల్లి స్థాయిలో మంతనాలు సాగిస్తున్నాడు. 2019 లో పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూసిన పవన్...

Bigg boss 4: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్? ఈసారి...

అబ్బ.. ఇది కదా ఆట అంటే. మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఆట చాలా టైట్ అయిపోయింది. ప్రతి నిమిషం ఉత్కంఠగా మారుతోంది. కంటెస్టెంట్లు కూడా ఇప్పుడు ఆచితూచి ఆడాల్సి...

ప్రేమ‌లో ప‌డ్డ ఆమీర్ ఖాన్ కూతురు.. ఎవ‌రితో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ ఈ మ‌ధ్య వార్త‌ల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొన్న లైంగిక...

రావడం రావడమే టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు సంధించిన స్మృతి ఇరానీ?

స్మృతి ఇరానీ.. మంచి వాగ్దాటి. బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. అందుకే ఆమె బీజేపీ హయాంలో కేంద్రమంత్రగా కొనసాగుతూ వస్తున్నారు. బీజేపీ మొదటి హయాంలోనూ ఆమె కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయితే.. ఎక్కడో...

రుద్రాక్ష విశేషాలు ఇవే !

రుదాక్ష.. హిందుమతంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో ఒకటి. శివుడి నుంచి ఏర్పడిని వీటిని శక్తివంతమైనవిగా వీటిని భావిస్తారు. వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. వీటిలో ఒక ముఖం నుంచి...

లాస్య‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన భ‌ర్త‌.. జున్నుని చూసి త‌న్మ‌య‌త్వం చెందిన వంట‌ల‌క్క‌

ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన లాస్య పెళ్ళి త‌ర్వాత కాస్త స్లో అయింది. పున్వ‌ర్వైభ‌వం అందుకునేందు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. 11వారాల పాటు స‌క్సెస్‌ఫుల్‌గా త‌న జ‌ర్నీని కొన‌సాగించిన లాస్య అనుకోకుండా హౌజ్‌ని...

సొంత జిల్లాలోనూ చేతులెత్తేసిన చంద్రబాబు.!

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌, కరోనా కారణంగా మృత్యువాతపడ్డంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా ఈ ఉప ఎన్నికకు...