Home Telugu Movie Review క్వశ్చన్ మార్కు స్పై భక్తి - 'వార్' మూవీ రివ్యూ!

క్వశ్చన్ మార్కు స్పై భక్తి – ‘వార్’ మూవీ రివ్యూ!

క్వశ్చన్ మార్కు స్పై భక్తి – ‘వార్’ మూవీ రివ్యూ!

Advertisement

యాక్షన్ సినిమాలు తగ్గి స్పై థ్రిల్లర్స్ పెరుగుతున్నాయి. రోమియో అక్బర్ వాల్టర్, నామ్ షబానా, రాజీ, టైగర్ జిందా హై… ఇప్పుడు ‘వార్’. ఈసారి ఇద్దరు సీనియర్, జూనియర్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో డిఫరెంట్ స్పై థ్రిల్లర్ ని ప్రయత్నించారు. ప్రయత్నించిన దర్శకుడు ‘సలాం నమస్తే’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్. నిర్మించిన బ్యానర్ ప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇది డిఫరెంట్ ఎందుకంటే దీనికి యాక్షనే తప్ప కంటెంట్ పట్టలేదు. అయినా బాక్సాఫీసుని వూపుతోంది. ఇదే కొత్త సక్సెస్ మంత్రమైతే ఇక హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ల మీద ఆధారపడాల్సిందేనా? వాళ్ళు లేని యాక్షన్ సినిమాలు ఇక సాధ్యం కావా? వాళ్ళుంటే ఇక కంటెంట్ అవసరం లేదా? కంటెంట్ లేక హాలీవుడ్ యాక్షన్ తో ‘సాహో’, ‘బందోబస్త్’ లు ఫ్లాపయ్యాయి. కంటెంట్ లేని యాక్షన్ తో ఎప్పుడో అదృష్టవశాత్తూ ‘వార్’ లాంటి అద్భుతాలు జరుగుతాయా? పరిశీలిద్దాం…

కథ
‘రా’ – రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (భారత రహస్య గూఢచార సంస్థ) ఏజెంట్ ఖాలిద్ రెహ్మానీ (టైగర్ ష్రాఫ్) కి, ‘రా’ కి విరోధిగా మారిన ఏజెంట్ కబీర్ లూథ్రా (హృతిక్ రోషన్) ని చంపమని ఆపరేషన్ని అప్పజెప్తాడు ‘రా’ చీఫ్ కల్నల్ లూథ్రా (ఆశుతోష్ రాణా). ఖాలిద్ కబీర్ కింద పని చేసిన జూనియర్. గతంలో ‘రా’ మాజీ ఏజెంట్ అయిన ఖాలిద్ తండ్రి శత్రువులతో చేతులు కలిపి దేశ ద్రోహం చేశాడు. కబీర్ అతణ్ణి వెతికి పట్టుకుని చంపేశాడు. భర్త వల్ల కుటుంబం మీద పడ్డ దేశద్రోహం మచ్చకి ఖాలిద్ తల్లి (సోనీ రాజ్దాన్) వేదనతో వుంది. ఈ మచ్చని రూపుమాపాలని పట్టుదలతో ఖాలిద్ ‘రా’ లో ఏజెంట్ గా చేరాడు. దీంతో అడుగడుగుబా అతడి నిజాయితీ, దేశ భక్తీ పరీక్ష నెదుర్కొంటున్నాయి. నిరంతరం వీటిని నిరూపించుకునే పనిలో వున్నాడు. ఇప్పుడు తన సీనియర్ని వెతికిపట్టుకుని చంపే బాధ్యత మీద పడింది. ఈ బాధ్యత నెరవేర్చగలిగాడా? తన దేశభక్తిని ఎలా నిరూపించుకుని కుటుంబం మీద పడ్డ మచ్చని తొలగించుకోగలిగాడు? అసలు కబీర్ తను పనిచేసే ‘రా’ కి ఎందుకు విరోధిగా మారాడు? అలా మారి అతనేం చేస్తున్నాడు? విదేశంలో వుంటున్న క్రిమినల్ బిజినెస్ మాన్ రిజ్వాన్ ఇలియాసీ (సంజీవ్ వాస్త) తో కబీర్ కేం సంబంధం? ఫేషియల్ సర్జరీలు చేసే డాక్టర్ మల్లికా సింఘాల్ (దీపాన్నితా శర్మ) ఎలా ఇలియాసీతో ఇన్వాల్వ్ అయింది? ఇంకో ‘రా’ ఏజెంట్ సౌరభ్ ఎందుకు రిజ్వాన్ పక్షాన చేరాడు? వీటన్నిటి నేపథ్యంలో బద్ధ శత్రువులైన కబీర్ – ఖాలిద్ ల మధ్య వార్ ఎలాముగిసింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ఈ స్పై జానర్ కథ చివర్లో కబీర్ పాత్ర చెప్పినట్టు ఖాలిద్ పాత్రది, ఈ వార్ కి హీరో అతనే. ఇలా ఈ సారి స్పై జానర్ కథని ఈ వర్గం పాత్ర దేశభక్తిని నిరూపించేందుకు వినియోగించారు. అరడజను హిందీ సినిమాల్లో ఈ వర్గం పాత్ర దేశ భక్తిని నిరూపించి నిరూపించి వున్నారు. ఇంకా పరీక్షించి నిరూపించాలి. బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ దేశభక్తిని ఒక మోడీ భక్తురాలైన యాంకర్ ప్రశ్నించినప్పుడు, ఎవరేం అనుకున్నా దేశంతో తనకున్న ప్రేమ అంగుళం కూడా చెక్కు చెదరదనేసి చప్పట్లు మోగించుకున్నాడు పబ్లిక్ సభలో. జనాభాకి రెచ్చగొడితే ఎన్నికల్లో తప్ప, సినిమాల్లో దేశభక్తి సమస్యే కాదు. అయినా నార్త్ మీడియాలో, బాలీవుడ్ లో ఈ వర్గం దేశభక్తి అమ్ముడయ్యే ఫార్ములాగానే భావిస్తున్నారు. గతంలో ఈ పాత్రలు హీరో పాత్ర కోసం ప్రాణాలర్పించే పాత్రలుగా వుండేవి. ఇప్పుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తేనే దేశ భక్తి అన్నట్టుగా చూపిస్తున్నారు. జనాభాలో కొద్ది శాతం మంది కోసం ఎవ్వరూ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కి అవసరం లేని ఈ భావజాలం అనవసరంగా ప్రేక్షకుల మీద రుద్దడమే. ఈ విధంగా ఈ కథకి కథా ప్రయోజనమంటూ ఏమీ లేదు. చివరికి ఖాలిద్ కి మరణానంతర మెడల్ ని అతడి తల్లికి ‘ప్రధాని నరేంద్ర మోడీ’ అందిస్తున్నట్టు ముచ్చటైన ఓదార్పు ముగింపు! దేశంలో ఒక వర్గాన్ని  నెగెటివ్ గా చూపడంలో దూకుడు పెరుగుతూంటే, వాస్తవ దూరంగా ఈ కథ.

ఈ కథతో మౌలిక సమస్య ఒకటుంది. ఇంతా చేసి దేశభక్తి నిరూపించుకోవాల్సిన పాత్ర అనుమానాస్పదంగా వుంది. కబీర్ ని చంపమని బాస్ అప్పగించిన పనిని దేశం కోసం డ్యూటీగానే ఖాలిద్ చేస్తున్నాడా, లేక కబీర్ తన తండ్రిని చంపాడన్న పగతో చేస్తున్నాడా అన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య తలెత్తింది. తండ్రి వల్ల పడ్డ దేశద్రోహం మచ్చ తొలగించుకోవడానికే ‘రా’ లో చేరినప్పుడు, ఆ దేశ ద్రోహి తండ్రిని చంపిన వాణ్ణి చంపాల్సి వస్తే, అది దేశభక్తి నిరూపణ కోసమే చేస్తున్నట్టు ఎలా నమ్మాలి? ఇంకో హఫీజ్ సయీద్ నో, దావూద్ ఇబ్రహీంనో చంపడానికి బయల్దేరితే అది దేశభక్తి అని నమ్మొచ్చు గాని?

ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యక్తిగత పగ – దేశ భక్తిలతోనే కాదు, ఇంకా కలగాపులగం చేస్తూ గురుశిష్య సంబంధంతోనూ వుంది. ఖాలిద్ జూనియర్, కబీర్ శిక్షణ నిచ్చిన సీనియర్. గురువుగార్ని చంపడానికి మనసెలా ఒప్పుతుంది. ఒకవేళ చంపినా దేశం కోసమా, పగకోసమా?
గత వారం ‘అర్బన్ నక్సల్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లఖా కేసు విచారించడానికి ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీలు నిరాకరించారు. కారణాలు చెప్పలేదు. వాళ్ళలో ఒక జడ్జికి కాన్ఫ్లిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య ఎదురైనట్టుందని అనుకున్నారు. ఆయన గతంలో నవ్లఖా తరపున లాయర్ గా ఒక కేసు వాదించాడు. కనుక ఇప్పుడు జడ్జిగా కేసు విచారిస్తే అధికారాన్నుపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నట్టుగా అవుతుందని (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్), అందువల్ల కేసు తిరస్కరించి వుంటారని భావించారు.
ఖాలిద్ పాత్ర కూడా ఈ సిట్యుయేషన్లోనే వుంది. ఇతడికి ‘రా’ చీఫ్, కబీర్ ని చంపే డ్యూటీ వేయనేకూడదు. వేస్తే ఖాలిద్ పగతో, దేశంతో, శిష్యరికంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణం చెప్పి తిరస్కరించాలి. అలా చేస్తే ఈ కథే వుండదు. కనుక ఈ కామన్ సెన్సుని చంపి, అంటీ ముట్టని పాత్రలతో అంటీ ముట్టని కథ నడిపేశారు. బుద్ధి జీవులకైతే ఖాలిద్ ‘రా’ ఏజెంటుగా అవకాశం దొరికిందని, వ్యక్తిగత పగతోనే గురువు కబీర్ ని చంపడానికి వెంట పడివుంటాడేమో అన్పిస్తుంది, దేశభక్తితో కాక. ఇలా ఇది క్వశ్చన్ మార్కు కన్ఫ్యూజుడు స్పై భక్తి కథగా తయారయ్యింది.

ఎవరెలా చేశారు
హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బద్ధశత్రువులుగా నువ్వా నేనా అన్నట్టు, హాట్ హాట్ హైటెక్ యాక్షన్ సీన్స్ తో రోమాంచితంగా హైలైట్ అయ్యారు. ఇద్దరు పాపులర్ యాక్షన్ స్టార్లు ఒకే తెరమీదికొచ్చి విలన్స్ లా పదేపదే కొట్టుకుంటూ వుంటే, ఎగురుతున్న విమానం రెక్కమీదికి దూకి రజనీకాంత్ కి కూడా రాని అయిడియాలు ప్రదర్శిస్తూ, ఇంకో ఎగురుతున్న విమానం మీదికి దూకి, లోపలికి జొరబడి లడాయి మొదలుపెట్టుకుంటే. ప్రమాదకరమైన ఫారిన్ ఘాట్ రోడ్స్ మీద హై ఎండ్ పవర్ బైక్స్ మీద ఛేజింగులు చేసి పడేసి కొట్టుకుంటే – వుండే మజా ఇంకెందులోనూ లేదు. ఇలా బాగాలేని కథ రాసిన కాగితాలు ఎటెటో ఎగిరిపోయి పీడా విరగడైంది. కాగితాలు పనికిరాకపోతే కుమ్ములాటలైనా పనికిరావాలి బాక్సాఫీసుకి.

ఇద్దరు సీనియర్, జూనియర్ సిక్స్ ప్యాక్ యాక్షన్ స్టార్స్ ని ఒకరికొకర్ని యాంటీగా సెట్ చేసి, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆడిన పేకాట, ఇంటర్ ప్లే, పైరో డైనమిక్స్, జంబో ఎనర్జిటిక్స్, హైపవర్ ఎర్గోనమిక్స్ వగైరా వగైరాలతో కూడిన యాక్షన్ డైనమిక్స్ – ఇవే ఈ 200 కోట్ల మెగా బడ్జెట్ ప్రొడక్షన్ ని బంపర్ బాక్సాఫీసు బొనాంజాగా ప్రేక్షకులకి అమ్మేశాయి పండగ రోజుల్లో పానిండియా మూవీగా, పాన్ మసాలాగా. ఇద్దరు స్టార్స్ మీద ‘జైజై శివ శంకర్’ మాస్ సాంగ్ మత్తులో వూగించే ఇంకో జోడా బైల్ టుబాకో మసాలా.

హాలీవుడ్, కొరియన్, ఇండియన్ స్టంట్ డైరెక్టర్స్ (పాల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ సిల్ఫస్, సీ యంగ్, పర్వేజ్ షేక్) యాక్షన్ ని వినూత్నంగా ఫాంటసీగా మార్చేసి జనరంజకం చేశారు. ఈ యాక్షన్ హంగామాలో ఇద్దరు హీరోయిన్లు వాణీ కపూర్, అనుప్రియా గోయెంకాలకి ఆనవాయితీగానే, సహజాతి సహజంగానే అరగంట మేర పాత్రలు దక్కలేదు. విలన్స్ కి ప్రాధాన్యంలేదు. హీరోలే ఒకరికొకరు విలన్స్ కాబట్టి.

కెమెరా మాన్ బెన్ జాస్పర్ కలర్ఫుల్ విజువల్స్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో చాలా సేపు మందగించిన నడకతో సమస్య నెదుర్కొంది. విశాల్ – శేఖర్ సంగీతంలో పాటలు హిందీకే గానీ, తెలుగు డబ్బింగ్ కి మెప్పించేవిగా లేవు. ఇక రాసిన కాగితాలు ఇంకెంతగా పనికిరాలేదంటే, అబ్బాస్ టైర్ వాలా డైలాగులు యాక్షన్ మూవీ జానర్ కి తగ్గట్టుగా చిల్లీ పెప్పర్ గా లేవు. డైలాగ్ పార్టుని ఫిలాసఫీ ఆక్రమించింది. 120 సినిమాలు రాసిన ఈ దర్శకుడి తాత ది ఫేమస్ ఇందర్ రాజ్ ఆనంద్, అమితాబ్ బచ్చన్ మాస్ సినిమాలకి రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమసే.

చివరికేమిటి
అర్ధంలేని రైటింగ్ కి అర్ధమయ్యే షూటింగ్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితి సృష్టించారు. సక్సెస్ కి రైటింగ్ కాదు, షూటింగ్ అని రిస్కీ గేమ్ ఆడారు, ఇద్దరు వైబ్రెంట్ స్టార్స్ ని యాంటీగా పెట్టడమే సెల్లింగ్ పాయింట్ అవుతుందనీ, వాళ్ళ మధ్య గ్రేట్ యాక్షన్ కి కథతో పనిలేదనీ అన్నట్టుగా బాక్సాఫీసుకి సవాలు విసిరారు. దీనికి తగ్గట్టుగానే 300 నుంచి 350 కోట్లు ముట్టజెప్పేందుకు బాక్సాఫీసు సిద్ధంగా వుంది. మొదటి రోజు కలెక్షన్స్ తోనే అన్ని హిందీ సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసింది. కేవలం నాల్గురోజుల్లో ఓవర్సీస్ కలుపుకుని 216 కోట్లతో అపూర్వ రికార్డు సృష్టించింది.

ఇక రైటింగ్ గురించి రివ్యూలేం రాస్తారు. రైటింగ్ లో పైన చెప్పుకున్న కాన్సెప్ట్ పరమమైన లోపాలతో బాటు, ఇంకా గతంలో ఖాలిద్ తండ్రిని చంపిన కబీర్, దేశంకోసం పనిచేస్తున్నశిష్యుడైన ఖాలిద్ ని శత్రువుగా చూసి, తన్నడంలో కబీర్ పాత్రకి కూడా జస్టిఫికేషన్ లేకపోవడం, అసలు కబీర్ ఎందుకు ‘రా’ కి వ్యతిరేకంగా మారాడో చెప్పకపోవడం, బేసిగ్గా కబీర్ – ఖాలిద్ లని యాంటీగా సెట్ చేయడంలో ఎలాటి లాజిక్ లేకపోవడం, సెకండాఫ్ లో సస్పెన్స్ కోసం ఖాలిద్ కి పెట్టిన ట్విస్టు ఒక లక్ష్యంతో కొనసాగుతున్న అతడి పాత్ర ప్రయాణాన్ని ఆపేసేలా వుండడం, ఉన్నట్టుండి కేరళలో పెళ్లి సీను పెళ్లి సినిమా చూస్తున్నట్టు జానర్ మర్యాద తప్పడం …ఇలా ఎక్కడికక్కడ పాత్రల్నీ, కథనీ కిల్ చేస్తున్న కంటెంట్ కి రివ్యూ రాయడంలో అర్ధమే లేదు. సిద్ధార్థ్ ఆనంద్ – శ్రీధర్ రాఘవన్ ల స్క్రీన్ ప్లే ఒక బ్లండర్ బాజీ. అదృష్టవశాత్తూ కేవలం షూటింగ్ తో సక్సెస్ ప్రూవయింది. రైటింగ్ కి సెండాఫ్ ఇద్దాం.

దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
తారాగణం : హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్, అనుప్రియా గోయెంకా, దీపాన్నితా శర్మ, సోనీ రాజ్దాన్, ఆశుతోష్ రాణా తదితరులు
కథ : ఆదిత్యా చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్; స్క్రీన్ ప్లే : సిద్ధార్థ్ ఆనంద్, శ్రీధర్ రాఘవన్; మాటలు : అబ్బాస్ టైర్ వాలా, సంగీతం : విశాల్ – శేఖర్, ఛాయాగ్రహణం : బెన్ జాస్పర్
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా
3 / 5

-సికిందర్ 

- Advertisement -

Related Posts

అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

పేరు: నిశ్శబ్దం విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020 నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే డైరెక్టర్: హేమంత్ మధుకర్ ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్ అనుష్క.. బాహుబలి సిరీస్...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

డబుల్ బ్యారెల్ మోరల్ ‘శకుంతలా దేవి’ రివ్యూ!

గణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్...

Run webseries review

Rating: 1.5/5 Cast: Navdeep, Poojitha Ponnada, Venkat,Amit Tiwari,Mukthar Khan, Kausalya,Manali Rathode,Shafi,Madhu Nandan,Bhanu Sri,Kireeti Damaraju and others Music: Naresh Kumaran Cinematography: Sajeesh Rajendran Director: Lakshmikanth Chenna Banner: First Frame...

Latest News

ఎన్నికలను అడ్డు పెట్టుకొని కుట్రలు చేసే సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో...

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ...

బ్రేకింగ్: అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా కన్నుమూత

అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా ఇకలేరు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన వయసు 60 ఏళ్లు. అర్జెంటీనాలో ఫుట్ బాల్ అంటే ఎంత క్రేజో.. డిగో మారడోనాకు...

ఆస్కార్ 2021కి భారత్ నుండి అధికారిక ఎంట్రీగా మలయాళ చిత్రం...

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికైంది . బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది....

తెలంగాణ ప్రభుత్వానికి అక్బరుద్దీన్ సవాల్? దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించండి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ... హైదరాబాద్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే... హైదరాబాద్ లో ముఖ్యంగా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఎంఐఎం...

ఆంధ్ర ప్రదేశ్ లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహాలో సీఎం జగన్ వినూత్న పథకానికి రూపకల్పన చేశారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమం...

ఆ వయసులోనే అలాంటి లెటర్.. నిహారికపై నాగబాబు కామెంట్స్

నాగబాబు యూట్యూబ్‌లో మన చానెల్ మన ఇష్టం పేరిట నిత్యం ఏదో టాపిక్ మీద మాట్లాడుతుంటాడు. తాజాగా రెండ్రోజుల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరిలేషన్‌కు కమ్యూనికేషన్స్ ముఖ్యమని...

ప్లేటు ఫిరాయించిన రాహుల్ సిప్లిగంజ్.. అనూహ్యంగా ఆమెకు మద్దతు

రాహుల్ సిప్లిగంజ్..ఎప్పుడూ ఇతడి పేరు వార్తల్లో నానుతూనే ఉంటుంది. డ్రంక్ డ్రైవ్ లో దొరికి ఒకసారి, పబ్ లో గొడవతో మరోసారి, బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి మరోసారి రెండు తెలుగు...

అలాంటి వార్తలు రావడమేంటి.. రకుల్‌కు ఇదేం కర్మరా బాబు!!

రకుల్ ప్రీత్‌పై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రకుల్ అది చేస్తోంది.. ఇది చేస్తోంది.. అక్కడి వెళ్లింది.. ఇక్కడకు వచ్చింది.. సినిమాల్లేవు.. ఖాళీగా ఉంటోంది.. రకుల్ సినిమాలను రిజెక్ట్ చేస్తోంది.....

Bigg boss 4: ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో...

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ముందు అభిజీత్ పేరే వినొస్తుంది. అభిజీత్.. ఏం మాట్లాడినా ఓ క్లారిటీ ఉంటుంది. ఏ టాస్క్ వచ్చినా మైండ్ తో...

రుద్రాక్ష ధరించడానికి నియమాలు ఇవే !

రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. వీటివల్ల అనేక రకాల ప్రయోజనాలు. అయితే వీటిని ధరించడానికి అనేక నియమాలు.. తెలుసుకుందాం.. రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన...

కార్పొరేటర్ గా గెలిచి మతాల మధ్య చిచ్చుపెడుతున్న బండి సంజయ్.. ఉత్తమ్...

ప్రస్తుతం ఎక్కడ చూసినా చలితో అంతా గజగజ వణుకుతున్నారు. కానీ.. హైదరాబాద్ లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. వాతావరణం అక్కడ ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావుడే....

జనసేనాని ఢిల్లీ టూర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళడం ముమ్మాటికీ రాంగ్‌ టైమింగ్‌.. అని జనసైనికులే ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ బీజేపీ, చాలా తెలివిగా పావులు కదిపింది...

హైద్రాబాద్‌లో డిసెంబర్‌ 4 తర్వాత ఏం జరగబోతోంది.!

రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడం, ఓ నాయకుడి మీద మరో నాయకుడు విరుచుకుపడటం అనేది ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. అయితే, అవిప్పుడు హద్దులు దాటుతున్నాయి....

బిగ్ బాస్ 4: దెయ్యాన్ని ఏదో చేస్తాడట, కామెడీతో రెచ్చిపోయిన అవినాష్

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎండింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. కాగా ఆటను మరింత రసవత్తరంగా మలిచేందుకు బిగ్ బాస్...

మంచు ఫ్యామిలీలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ …ఎన్ని సినిమాలో చూడండి...

ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించకుండా బిజీ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చినందుకు ఇక రకుల్ పనైపోయిందని అందరూ భావించారు. కాని అలా భావించన...

బాబోయ్ రానున్న రోజుల‌లో ర‌కుల్ చాలా బిజీ.. చాంతాడంత లిస్ట్ విడుద‌ల...

పంజాబీ సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుకే అదృష్టం ప‌రిగెడుతుందా అనిపిస్తుంది. తెలుగు ,త‌మిళం, హిందీ భాష‌ల‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మ‌డు చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఒక్క‌టి కూడా అందుకోలేదు....

సీక్రెట్ రివీల్ : పూజా హెగ్డే అందుకే ఇక టాలీవుడ్ సినిమాలకి...

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందా ... తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఒకసారి పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద...

హీరోయిన్‌ని ఫాల్తుదానివి అంటూ తిట్టిన నెటిజ‌న్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇక్క‌డ పెద్దగా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. అక్క‌డ తాప్సీ ప‌ట్టుకున్న‌దంతా బంగారం అయింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఈ...

న్యాయాన్ని నిలబెట్టిన అత్యున్నత న్యాయస్థానం 

న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని హతమారుస్తూ మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ పై స్టే ఇస్తూ సుప్రీమ్ కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతి పెద్ద...

తిరుపతి టికెట్ జనసేన కోరడం వెనుక పెద్ద వ్యూహ్యం!?

 తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇందులో భాగంగా ఢీల్లి స్థాయిలో మంతనాలు సాగిస్తున్నాడు. 2019 లో పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూసిన పవన్...

Bigg boss 4: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్? ఈసారి...

అబ్బ.. ఇది కదా ఆట అంటే. మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఆట చాలా టైట్ అయిపోయింది. ప్రతి నిమిషం ఉత్కంఠగా మారుతోంది. కంటెస్టెంట్లు కూడా ఇప్పుడు ఆచితూచి ఆడాల్సి...

ప్రేమ‌లో ప‌డ్డ ఆమీర్ ఖాన్ కూతురు.. ఎవ‌రితో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ ఈ మ‌ధ్య వార్త‌ల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొన్న లైంగిక...

రావడం రావడమే టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు సంధించిన స్మృతి ఇరానీ?

స్మృతి ఇరానీ.. మంచి వాగ్దాటి. బీజేపీలో పవర్ ఫుల్ లీడర్. అందుకే ఆమె బీజేపీ హయాంలో కేంద్రమంత్రగా కొనసాగుతూ వస్తున్నారు. బీజేపీ మొదటి హయాంలోనూ ఆమె కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయితే.. ఎక్కడో...

రుద్రాక్ష విశేషాలు ఇవే !

రుదాక్ష.. హిందుమతంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో ఒకటి. శివుడి నుంచి ఏర్పడిని వీటిని శక్తివంతమైనవిగా వీటిని భావిస్తారు. వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. వీటిలో ఒక ముఖం నుంచి...

లాస్య‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన భ‌ర్త‌.. జున్నుని చూసి త‌న్మ‌య‌త్వం చెందిన వంట‌ల‌క్క‌

ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన లాస్య పెళ్ళి త‌ర్వాత కాస్త స్లో అయింది. పున్వ‌ర్వైభ‌వం అందుకునేందు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. 11వారాల పాటు స‌క్సెస్‌ఫుల్‌గా త‌న జ‌ర్నీని కొన‌సాగించిన లాస్య అనుకోకుండా హౌజ్‌ని...

సొంత జిల్లాలోనూ చేతులెత్తేసిన చంద్రబాబు.!

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌, కరోనా కారణంగా మృత్యువాతపడ్డంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా ఈ ఉప ఎన్నికకు...