Home Telangana రాఖీ కట్టేందుకు వెళ్లనివ్వని భర్త, మహిళ ఆత్మహత్య

రాఖీ కట్టేందుకు వెళ్లనివ్వని భర్త, మహిళ ఆత్మహత్య

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో విషాదం చోటు చేసుకుంది. రాఖీ కట్టడానికి సోదరుడి వద్దకు పంపలేదని మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. మూడో అంతస్థు పైనుండి కిందికి దూకి ప్రాణాలు విడిచింది రాజస్థాన్ మహిళ.

రాఖీ కట్టడానికి తన అన్న వద్దకు పంపించలేదని మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. రాజస్థాన్ కు చెందిన ఉత్తమ్, దేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సికింద్రాబాద్ కుమ్మరిగూడలో నివాసముంటున్నారు. పుణేలో ఉంటున్న తన అన్నకు రాఖీ కట్టడానికి పంపించాల్సిందిగా దేవి తన భర్త ఉత్తమ్ ని కోరింది. అందుకు ఉత్తమ్ నిరాకరించాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ రాజుకుంది. మనస్థాపానికి లోనైన దేవి భర్త బయటకు వెళ్ళగానే వారు ఉంటున్న భవనం మూడో అంతస్థు నుండి కిందికి దూకింది. అది చూసిన స్థానికులు ఆమెను హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు ధృవీకరించారు.

మరణించిన దేవి అన్న మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని రాజస్థాన్ కి తీసుకువెళ్లారు బంధువులు. తల్లిని కోల్పయిన దేవి ముగ్గురు పిల్లలు తీవ్రంగా రోదిస్తున్నారు.

- Advertisement -

Related Posts

కేటీ‌ఆర్ పట్టాభిషేకానికి అడ్డం ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఇదే

తెరాస పార్టీలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ కేటీఆర్ పట్టాభిషేకం.  గత రెండేళ్లుగా ఈ విషయం ప్రస్తావనకు వస్తూనే ఉన్నా గత రెండు వారాలుగా మాత్రం మరీ గట్టిగా వినిపిస్తోంది.   ఈసారి...

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం చెప్పిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లో ప‌ర్య‌టించారు. చొప్ప‌దండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాతృమూర్తి ద‌శ‌దిన క‌ర్మ కార్య‌క్ర‌మంలో పాల్గొని అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్...

ఎట్టకేలకు కిడ్నప్ కేసులో అఖిల ప్రియకు ఊరట !

తెలంగాణ: హాఫీజ్ పేట భూముల వ్య‌వ‌హారంలో బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి 'భూమా అఖిల ప్రియ'కు శుక్రవారం నాడు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ...

Latest News