నల్లగొండ సభ తర్వాత కోమటిరెడ్డికి ఏమైంది?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుస్తుందని… లేకపోతే తాను రాజకీయల నుంచి విరమించుకుంటానని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధకరమని, మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికే దామరచర్ల థర్మల్ ప్లాంట్ ను నిర్మించారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దామరచర్ల ఫ్లాంట్ ను మూసివేయిస్తామని చెప్పారు. తెలంగాణను నాలుగున్నరేళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 30 వేల కోట్లు దోచుకున్నారని, ఎస్ ఎల్ బీసిలో రూపాయి కూడా కమీషన్ రాదని పక్కకు పెట్టారన్నారు. దోపిడిదారులు, రౌడీలకే టికెట్లు కేటాయించారని వారిని గెలిపిస్తే నల్లగొండలో నిత్యం దోపిడిలు, హత్యలే ఉంటాయని  కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

గతంలో నల్లగొండలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలకు 12 గెలుస్తామని లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ నల్లగొండలో పెట్టిన తర్వాత 10 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని లేకపోతే రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటానన్నారు. దీంతో అంతా చర్చించుకుంటున్నారు. అంటే సీఎం సభ తర్వాత 2 స్థానాలు గెలవలేమనే భయం పట్టుకొని అలా మాట్లాడారా అవి ఏ స్థానాలు అనే చర్చ అందరిలో మొదలైంది.

అసెంబ్లీలో హెడ్ సెట్ విసిరిన ఘటనలో కోమటిరెడ్డి పై సస్పెన్షన్ పడినప్పుడు నల్లగొండలో 12 కు 12 స్థానాలు గెలిచి తమ సత్తా చూపుతామని కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. లేకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అంతకుముందు కేసీఆర్ నీళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని పొగిడారు. ఇప్పుడేమో 10 స్థానాలు గెలుస్తామని వ్యాఖ్యానించారు. ఇలా తనకు తోచినట్టు మాట్లాడుతుండటంతో అంతా కోమటిరెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు.

 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్