వరంగల్ లో ఇదేమి దరిద్రం.. డేంజర్ వీడియో

మనుషులకు, పశువులకు తేడా ఏంటో తరతరాలుగా మహానుభావులు చెబుతూనే ఉన్నారు. పురుషులందూ పుణ్య పురుషులు వేరయా అన్నారు. కానీ.. పురుషులందూ నీచ పురుషులు వేరయా అని ఎవరూ అనలేదు. కానీ వరంగల్ లో వీరు చేసిన పని చూస్తే అలాంటి భావన కలగక మానదు. ఇంతకూ వరంగల్ లో ఏంజరిగింది?

గత ఏడాది జులై నెలలో వరంగల్ నగరంలో టిఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లోకి చొరబడి దుండగులు వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అరెస్టులు చేశారు. అనంతరం మురళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అయితే బిజెపి కూడా మురళి సతీమణి మీద పోటీ చేసింది.

ఇక అసలు విషయానికి వస్తే అనిశెట్టి మురళి హత్యకు గురై ఏడాది గడుస్తున్న సందర్భంగా ఆయన హత్య జరిగిన తేదీని డెత్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఆయన ప్రత్యర్థులు హడావిడి చేశారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. కేక్ ను కూడా హత్య చేసినప్పుడు ఎలా మురళిని కత్తులతో వేటాడారో అలాగే కట్ చేశారు. పైగా ఈ సెలబ్రేషన్స్ ను వీడియో తీసి బయటకు వదిలారు.

ఇంతటి దారుణమైన ఘటన జరగడంతో వరంగల్ జనాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మనిషిని చంపిన తర్వాత కూడా పగ సాధించడం ఇదేమి సంస్కృతి అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కేక్ కట్ చేయడంతోపాటు హ్యాప్పీ డెత్ డే అంటూ సంబరాలు చేసుకున్నారు. వారు రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కింద ఉంది.