కేసీఆర్ “కిల్ బిల్ పాండే” : విజయశాంతి

ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము దైర్యం లేక కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు కూతలు కూస్తున్నాడని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్దంగా ఉందని, తాను ఈ సారి ఎన్నికలల్లో పోటి చేయనన్నారు. అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ ప్రచారం నిర్వహణ తనపై ఉందన్నారు.

కేసీఆర్ తన భ్రమలతో తాను ఏదో సాధించానని అనుకొని మళ్లీ సాధిస్తానని అనుకుంటున్నారన్నారు. రేసుగుర్రంలో కిల్ కిల్ పాండేలాగా కేసీఆర్ పని అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అసలు ఏ కారణంతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారో అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. తనకు  పార్టీలో 2 వస్థానం ఇచ్చి గౌరవించారు. కానీ చివరకు సమాధానం లేకుండా సస్పెండ్ చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు రెండో స్థానం ఇవ్వటం కోసం ఇలా చేసి ఉంటారని విజయశాంతి అన్నారు.

కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు తిట్టడం వల్లనే కాంగ్రెస్ నేతలు అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నారు కానీ లేకపోతే ఆయనను తిట్టాలని ఏమైనా పగనా అని విజయశాంతి ప్రశ్నించారు. అసలు ఎందుకు కేసీఆర్ అలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు. తాను ముఖ్యమంత్రిని అన్న సంగతి మరిచి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇతరులు కూడా గౌరవిస్తారన్నారు.

తనకు సీఎం పదవి పై ఆశ లేదని అంతా రాహుల్ గాంధీనే నిర్ణయిస్తారన్నారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు పోటిలో ఉన్నా అందులో తప్పేం లేదన్నారు. టిఆర్ ఎస్ లో కవిత,హరీష్, కేటిఆర్ లకు పదవి పై ఆశ లేదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఎవరు సీఎం అయ్యేది రాహుల్ గాంధీ చూసుకుంటారన్నారు.

ప్రస్తతం తన పై అతి పెద్ద బాధ్యత ప్రచార నిర్వహణ ఉందని పార్టీ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ప్రచారం నిర్వహించి పార్టీని గెలిపించాలనే తపనతో ఉన్నానన్నారు. కేసీఆర్ ను ఎలా ఢికొట్టాలో అనే దాని పైనే వ్యూహ రచన చేస్తున్నానని విజయశాంతి అన్నారు. కేటిఆర్, హారీష్ రావులు చిన్నపిల్లలని వాళ్ల గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.