కేసీఆర్ భాష  మోదీకి అర్ధం కాలేదా : విజయశాంతి

ఫెడరల్ ఫ్రంట్ గురించి తనకు తెలియదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యల పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కామెంట్ చేశారు. ఆమె ఏమన్నారంటే…

“కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఫార్ములా ఆయన ప్రత్యర్దులకు అర్ధం కాలేదంటే నమ్మొచ్చేమో కానీ మోదీకి అర్దం కాలేదంటే అందులో ఖచ్చితంగా ఏదో లోపం ఉన్నట్టే. దీన్ని బట్టి కేసీఆర్ ప్రయత్నంలో ఏదో లోపం ఉందని అనుమానం వస్తోంది. కేసీఆర్ ఫ్రంట్ పై ప్రధాని వ్యాఖ్యల తర్వాతనైనా బిజెపికి అర్ధమయ్యేలా, వాళ్ల సిద్దాంతాలకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు కానీ బిజెపి గుర్తిస్తుందేమో.

కేసీఆర్ హిందీ ఇంగ్లీషు భాషలో బ్రహ్మాండంగా మాట్లాడుతారు. కేసీఆర్ తన ఫ్రంట్ గురించి ఇంగ్లీషులో అంత చక్కగా చెప్పినా కూడా మోదీకి ఎందుకు అర్ధం కాలేదన్నది అసలు సిసలైన ప్రశ్న. ఇప్పుడు అందరి మెదళ్లకు ఇది సవాల్ గా మారింది. వీరిద్దరు అనుకొని మాట్లాడుతున్నారేమో” అని విజయశాంతి ఎద్దేవా చేశారు.