అసమ్మతి వాదులపై టిఆర్ఎస్ ముత్తిరెడ్డి వర్గీయుల దాడి (వీడియో)

జనగాం టిఆర్ ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను ముత్తిరెడ్డి యాదగిరికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు అసమ్మతి యువకులు, నాయకులు తరిగొప్పుల మండల కేంద్రంలో నిరసన తెలిపారు. జనగాం నియోజక వర్గం టికెట్ ను గుడి వంశీధర్ రెడ్డికి కేటాయించాలని నినాదాలు చేశారు. ముత్తిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తుండగా ముత్తి రెడ్డి వర్గీయులు యువకుల పై దాడి చేశారు. వారిని పట్టుకొని చితకబాదారు. ముత్తిరెడ్డి వర్గీయులు దాడి చేసిన వీడియో కింద ఉంది చూడండి.

 

TRS MUTHIREDDY SUPPORTERS ATTACKED YOUNGERS

ముత్తిరెడ్డి జనగాం నియోజక వర్గానికి చేసిందేం లేదని కబ్జాలు, భూ దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడటం తప్పా అభివృద్ది చేయలేదని యువకులు విమర్శించారు. యువకులపై దాడి జరగడంతో వారు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి