అర్ధరాత్రి టిఆర్ఎస్ నేత అరెస్టు

టిఆర్ఎస్ రాష్ట్ర నేతను అర్ధరాత్రి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం మచ్చెర్ల శివారు తార్యాతండాకు రవికుమార్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకునిగా పని చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రవికుమార్ రైల్ రోకోలో పాల్గొన్నారు. అప్పుడు రవికుమార్ పై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని రవికుమార్ ను పలుసార్లు కోరినా రవికుమార్ హాజరు కాలేదు. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో రవికుమార్ ఇంటికి వెళ్లి అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

రవి కుమార్

రవికుమర్ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రోడ్డు షో నిర్వహిస్తుండగా ఆయన పై కోడిగుడ్లతో దాడి చేశాడు. మహబూబాబాద్ లో జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రైల్వే స్టేషన్ లో రాళ్లు రువ్విన కేసులో కూడా రవికుమార్ ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల పై కేసులు ఎత్తివేస్తామని ప్రకటించినా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎత్తివేయలేదు. కొన్ని రాష్ట్ర పరిధిలోని కేసులు ఎత్తివేశారు. రైల్వే కేసులు కేంద్రం పరిధిలోనివి కావడంతో ప్రభుత్వం చేతులేత్తేశింది.  దీంతో రవికుమార్ ను ప్రస్తుతం ఉద్యమ సమయంలోని కేసులోనే అరెస్టు చేశారు. మరి దీని పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.