రేవంత్ రెడ్డి అనుచరురాలు, ఆ మహిళా ఎమ్మెల్యేతో చర్చించాలంటే సంకోచిస్తున్న టిఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కారు జోరుతో దూసుకెళ్లి రెండో సారి అధికార పగ్గాలు చేపట్టింది. అయినా కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా టిఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని వారు కూడా టిఆర్ఎస్ లోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు కాంగ్రెస్ లో ఆందోళన కలిగించాయి. దీంతో అలర్ట్ అయిన నేతలు మేం ఏ పార్టీలోకి కూడా వెళ్లడం లేదని కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

అయితే భూపాలపల్లి జిల్లా ములుగు నుంచి గెలిచిన ఎమ్మెల్యే సీతక్కను టిఆర్ఎస్ లో చేరాలని అడగాలంటేనే టిఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని తెలుస్తోంది. ఆమెను పార్టీలో చేరాలని అడిగే బదులు ఆమెకు ధీటైన టిఆర్ ఎస్ నాయకత్వం తయారు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ టిఆర్ఎస్ నేతలు అంతగా ఆందోళన ఎందుకు చెందుతున్నారంటే సీతక్క రేవంత్ రెడ్డి మనిషి. టిడిపిలో రేవంత్ రెడ్డి సీతక్క కలిసే పని చేశారు. కాంగ్రెస్ లో సీతక్క రేవంత్ రెడ్డి తో కలిసే చేరారు. 

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరురాలిగా ములుగు సీతక్కకు పేరుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేయాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి చేర్చుకునేందుకు కీలక నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటకే కొందరు నేతలతో చర్చలు జరిపారు. అయితే ములుగు సీతక్కతో మాట్లాడాలంటేనే వారు భయపడుతున్నారని తెలుస్తోంది. సీతక్క రేవంత్ రెడ్డితో పాటే టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరారు.

సీతక్కతో చర్చలు జరిపినా ఫోన్ లో మాట్లాడిన అది పెద్ద రచ్చ అవుతుందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఎందుకంటే నేతలు చర్చలు జరిపితే సీతక్క ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెబుతుంది. దానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. దాంతో పాటుగా వారు మాట్లాడిన ఫోన్ సంభాషణ కానీ వీడియోలు బయటపెడతారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే సీతక్క వైపు చూడాలంటేనే టిఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వారిని ఏ విధంగానైనా ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.

ఇప్పటికే తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఎలాగైన ఎమ్మెల్యేలందరిని పార్టీలోకి తీసుకొని అసలు తెలంగాణలో కాంగ్రెస్ అనేదే లేకుండా చేయాలని టిఆర్ఎస్ ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు నయాన భయాన కూడా లొంగకపోవడంతో ఏం చేయాలో పాలుపోక టిఆర్ఎస్ నేతలున్నారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరురాలు, ఎమ్మెల్యే సీతక్కతో చర్చిండం వారికి ఓ సవాల్ గా మారిందని తెలుస్తోంది.