టీఆర్ఎస్‌ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఫోన్ రొమాన్స్ (ఆడియో)

తెలంగాణ మొట్టమొదటి ఉపముఖ్యమంత్రి టీ.రాజయ్య. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరి కొన్ని వివాదాల కారణంగా సీఎం కెసిఆర్ ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు.

అయితే ఆది నుండి వివాదాలతో వార్తల్లో నిలిచే రాజయ్య మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఫోన్ లో రాజయ్య రాసలీల సంభాషణ చేస్తున్నాడంటూ ఒక ఆడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నెటిజెన్లు విపరీతంగా షేర్ చేయడంతో ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో కింద ఉంది వినవచ్చు.

రాజయ్య గతంలో స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా టీఆరెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తిరిగి స్టేషన్ ఘనాపూర్ నుండే ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

కాగా దీనిపై స్పందించారు రాజయ్య. నాకు స్టేషన్ ఘనాపూర్ నుండి టికెట్ లభించిన నేపథ్యంలో ప్రత్యర్ధులు కుట్ర పన్ని నా మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ఆడియోలో ఉంది నా వాయిస్ కాదు. కావాలనే నేనంటే గిట్టనివారు నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి నా గొంతులాగా వాయిస్ మార్చి ఇటువంటి ఆడియో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని తెలిపారు.