ఆ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న తెరాస నాయకత్వం

The TRS leadership is thinking of going with a new strategy in the by-election and winning anyway.

తెలంగాణ : నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక అభ్య‌ర్థి ఎంపిక‌లో టీఆర్ఎస్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్‌తో పాటు సామాజిక వ‌ర్గాల వారీగా అన్వేష‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య మృతి చెంద‌డంతో త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ కురువృద్ధుడు అయిన జానారెడ్డికి మంచి ప‌ట్టు ఉంది.గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సింహ‌య్య, జానాపై 7 వేల మెజార్టీతో విజ‌యం సాధించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.ఇక్క‌డ జానా రెండు సార్లు ఓడిపోగా రెండు సార్లు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల చేతుల్లోనే ఓడిపోయారు.అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో మంచి చైత‌న్యం కూడా ఉంది.దీంతో ఇప్పుడు ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక టీఆర్ఎస్‌కు క‌త్తిమీద సాములా మారింది.లో పార్టీ అభ్యర్థి ఎంపిక టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింద‌ని తెలుస్తోంది.

The TRS leadership is thinking of going with a new strategy in the by-election and winning anyway.
The TRS leadership is thinking of going with a new strategy in the by-election

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికలలో మెజారిటీ రాకపోయేసరికి ఆలోచనలో పడ్డ టీఆర్ఎస్‌ సాగర్ ఉప ఎన్నికను ఎలాగైనా గెలవాలని పట్ట్టుదలతో ఉంది. దుబ్బాక‌లో మృతి చెందిన రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణికి సీటు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ ఓడిపోయింది.దీంతో సాగ‌ర్‌లో అలాంటి పొర‌పాటు రిపీట్ కాకూడ‌ద‌ని గులాబీ వాళ్లు భావిస్తున్నారు.అయితే ఆ సాగర్ నియోజ‌క‌వ‌ర్గంలో కారు పార్టీకి బ‌ల‌మైన నేత లేరు,నోముల న‌ర్సింహ‌య్య స్థానికేత‌రుడు అయినా ఆయ‌న వ్య‌క్తిత్వం, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న్ను గెలిపించాయి. ఇప్పుడు ఆయ‌న కుటుంబానికి సీటు ఇస్తే వాళ్లు అక్క‌డ ఏ మేర‌కు పోరాడి గెలుస్తారు ? అన్న‌ది సందేహ‌మే.పైగా ఆయ‌న కుమారుడిపై చాలా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఇక దుబ్బాక‌లో కుటుంబానికే సీటు ఇచ్చి చేదు ఫ‌లితం రావ‌డంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఆ సాహసం చేసేందుకు రెడీగా లేదు.ఈ ఉప ఎన్నికలో కొత్త వ్యూహంతో వెళ్లి ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తుందట.