చంద్రబాబు దెబ్బకు ఫిరాయింపుల్లో టెన్షన్

చంద్రబాబునాయుడు దెబ్బకు ఏపి ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.   తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తున్న విషయం అదరికీ తెలిసిందే. కుకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల రోడ్డుషోల్లో మాట్లాడుతూ, ఫిరాయింపు ఎంఎల్ఏలను చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరుతున్నారు చంద్రబాబు. పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో చాలామంది టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు.

 

అందులో భాగంగానే కుకట్ పల్లిలో గెలిచిన మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధిలు కూడా టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు. తాజా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఫిరాయింపు ఎంఎల్ఏలను ఓట్లు వేయొద్దని, చిత్తుగా ఓడించాలని పిలుపివ్వటమే ఏపిలో ఫిరాయంపులకు పెద్ద సమస్యగా మారింది.

 

తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన టిడిపి ఎంఎల్ఏలకు ఓట్లు వేయకుండా చిత్తుగా ఓడించాలని పిలుపిస్తే మరి ఏపిలో ఫిరాయించిన తమ మాటేమిటనే సమస్య వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏల్లో మొదలైంది. తెలంగాణాలో ఫిరాయించిన ఎంఎల్ఏలను జనాలు ఓడిస్తే రేపటి ఏపి ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీటవుతుంది కదా అని ఫిరాయింపులు మదనపడుతున్నారు. తెలంగాణా ఎన్నికల్లో ఫిరాయింపుల ప్రస్తావన తేకుండానే టిఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించమని చెబితే సరిపోయేదానికి జనాల్లో ఫిరాయింపులపై చర్చ జరిగేలా చంద్రబాబే అనవసరంగా కెలికినట్లైందని ఏపిలో ఫిరాయిపుంల్లో ఆందోళన మొదలైంది.

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలను టిడిపిలోకి లాక్కున్నారు. టిడిపిలోకి ఫిరాయించిన వారంతా భారీగా అమ్ముడుపోయిన మాట వాస్తవమే. దాంతో తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఫిరాయింపుల్లో  చాలామంది జనాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే కొందరు ఫిరాయింపులకు టిక్కెట్లిచ్చేది  లేదని కూడా చంద్రబాబు చెప్పేస్తున్నారు.

 

బద్వేలులో జయరాములు, కోడుమూరులో మణిగాంధి, చోదవరంలో వంతల రాజేశ్వరి లాంటి కొందరికి టిక్కెట్లిచ్చేది లేదని ఇప్పటికే చెప్పేశారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఫిరాయింపుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి పరిస్దితుల్లో ఫిరాయింపులకు ఓట్లేయొద్దని, చిత్తుగా ఓడించటమని చంద్రబాబు చెప్పటంపై ఏపిలో ఫిరాయింపులు మండిపోతున్నారు.