మంత్రి పద్మారావుకు షాక్ ఇచ్చిన అనుచరులు (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. బయటి పార్టీల వారు కాకుండా సొంత పార్టీ వారే టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులకు షాక్ ఇస్తూ సంచలనం రేపుతున్నారు. పార్టీలో బిటి బ్యాచ్ వర్సెస్ యూటి బ్యాచ్ రగడ కూడా బాగానే నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ లోని సొంత పార్టీ కార్యకర్త షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలు చదవండి వీడియో కూడా కింద ఉంది.

సికింద్రాబాద్ నియోజకవర్గానికి అడ్డగుట్ట గుండెకాయ లాంటిది. సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలవాలన్నా అడ్డగుట్టలో మెజార్టీ తెచ్చుకుంటేనే లెక్క. అడ్డగుట్ట డివిజన్ సికింద్రాబాద్ క్యాండెట్ గెలుపోటములను నిర్దేశిస్తుంది. అంతటి బలమున్న అడ్డగుట డివిజన్ లో టిఆర్ఎస్ యూటి బ్యాచ్ కు చెందిన కార్యకర్త దాసరి శ్రీనివాస్ మంత్రిపై తిరుగుబాటు చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో కష్టనష్టాలకు ఓర్చి పని చేశానని చెప్పారు.

కేసిఆర్ అడుగులో అడుగు వేసి నడిచిన పద్మారావు గౌడ్

ఈ ఎన్నికల్లో పద్మారావు గౌడ్ వందకు వంద శాతం ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు శ్రీనివాస్. తాను టిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ పద్మారావు గౌడ్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రకటించారు. అంతే కాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచే అవకాశం లేదని, ఇదొక సెంటిమెంట్ నెలకొని ఉందని వివరించారు. 

హైదరాబాద్ జిల్లాలో ఈసారి సికింద్రాబాద్ సీటులో ఓడిపోతే హైదరాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పరువు అంతా గంగలో కలుస్తుందన్నారు.  ఈ జిల్లాలో2014 ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచామని, అదే పద్మారావు గౌడ్ అని చెప్పారు. తామంతా రాత్రింబవళ్లు తిండిలేక తిప్పలు లేక పని చేసి సికింద్రాబాద్ లో  గెలిపించామన్నారు. అప్పటి గెలుపు పద్మారావు గెలుపు కాదని చెప్పారు. అదే పద్మారావు 2009లో సనత్ నగర్ లో ఓడిపోయిండని గుర్తు చేశారు శ్రీనివాస్.

అంతేకాకుండా సికింద్రాబాద్ ఓటర్లలో టిఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. టిఆర్ఎస్ కింది స్థాయి లీడర్లలో కూడా వ్యతిరేక ఉందని చెప్పారు. బయట పడడంలేదు కానీ లోలోపల తీవ్రమైన వ్యతిరేకత ఉందని వివరించారు. రానున్న ఎన్నికల్లో పద్మారావు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు శ్రీనివాస్.

శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడిన బైట్ కింద ఉంది. ఆయనేమన్నారో ఒకసారి చూడండి.

 

padma rao minister