ఉత్తమ్ కాబోయే సిఎం సరే.. మరి బోనాలకు లింకెందుకు ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంచి జోరు మీదున్నారు. ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో తాము అధికారంలోకి రావడం ఖాయమన్న భావనతో ఉన్నారు. సిఎం ఎవరు, మంత్రులు ఎవరు అని కూడా బహిరంగ ప్రటకనలు గుప్పించుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డే 2019 లో కాబోయే సిఎం అని ఒక నాయకుడు బహిరంగసభలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు చదవండి.

బోడుప్పల్ లొ  కాంగ్రెస్ పార్టీ సభ జరిగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి భారిగా చేరికలు జరిగాయి. టిడిపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపోలు రాములు, బొమ్మక్ రమేష్ ల ను, వివిద పార్టీల నేతలకు కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సభకు హాజరైన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారో చదవండి.

చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో వచ్చేటట్లు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం ..కాంగ్రెస్ కలిపోయేటట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అన్నిపక్షాలు కాంగ్రెసుతో కలిసివస్తాయని సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు తప్పకుండా గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. వచ్చే బోనాల నాటికి ఉత్తమ్ ముఖ్యమంత్రి గా సికింద్రాబాద్ బోనాలకు హాజరవుతారు. ఉత్తమ్ ముఖ్యమంత్రి అయ్యాక నన్ను బోడుప్పల్ కాంగ్రెస్ నేతలను మర్చిపోవద్దు. ఉత్తమ్ కాబోయే ముఖ్యమంత్రి అని వందసార్లు అనడానికైనా సిద్దంగా ఉంటా. అధిష్టానం ఉత్తమ్ పనితీరును మెచ్చుకుంటుంది. రాహుల్ గాంధీ , సోనియా గాంధీ ఉత్తమ్ పనితీరును మెచ్చుకుంటున్నారు. నాకు  కేంద్ర మంత్రి పదవిని రాహుల్ గాంధీ దగ్గర అడ్వాన్స్ బుకింగ్ చేసిపెట్టుకున్నా. రాహుల్ గాంధీ అభయం ఇచ్చాడు.

సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారో చదవండి. కేసీఆర్ ఆకర్షణీయ మాటలు, హామీల వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. కేసీఆర్ అన్ని హామీల పై  ప్రజలను మోసం చేశారు. తన కుటుంబానికి అనుకూలంగా వ్యవస్థను మార్చుకున్నారు. నాలుగున్నారేళ్లలో మోడీ, కేసీఆర్ హైద్రాబాద్ కు చేసింది ఏమి లేదు. కాంట్రాక్టర్ల కమిషన్ లకు కక్కుర్తి పడి పని చేస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే కెసీఆర్ కుటుంబం పని. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది. ఇటీవల పార్టీ జరిపిన సర్వేలో అదే తేలింది. తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారు తప్ప జనాలు కాదు.